కిరాణా షాప్ లో నాకు ఎదురైన సంఘటన.! ఎన్నిసార్లు రా?? అంటూ వాయించి వదిలిన షాప్ ఆంటీ.!  

పాలప్యాకెట్ కోసం మా రూమ్ దగ్గరే ఉన్న ఓ కిరాణా షాప్ కు వెళ్లాను. ఆ షాప్ ఆంటీ మాకు చాలా పరిచయం….అక్కడ మాకు ఖాతా ఉంది. సరిగ్గా నేను పాల ప్యాకెట్ కు వచ్చినప్పుడే ఓ వ్యక్తి చేతిలో 500 రూపాయల నోటు పట్టుకొని షాప్ ముందు నిల్చుని తనకు కావాల్సిన సరుకులు ఒక్కొక్కటిగా చెబుతున్నాడు, ఆ షాప్ ఆంటీ కూడా అతడు అడిగిన సామాన్లు ఒక్కొక్కటిగా తీసి ఇస్తుంది. అతనికి సరుకులు ఇవ్వడం మధ్యలో ఆపి, నాకు పాల ప్యాకెట్ ఇచ్చి పంపింది షాప్ ఆంటీ.

Customer Makes Fool To The Shop Owner-Telugu Fun Story's Viral In Social Media

Customer Makes Fool To The Shop Owner

మళ్లీ ఓ మూడు రోజుల తర్వాత కొన్ని సరుకులు తెద్దామని అదే షాప్ కు వెళ్ళాను… ఈ సారి కూడా ఆ వ్యక్తే… చేతిలో 2000/- నోట్ పట్టుకొని తనకు కావాల్సిన సామాన్లను ఒక్కొక్కటిగా చెబుతున్నాడు. ఈ సారి సీరియస్ గా ఆంటీ అతడు చెప్పిన సరుకులను ఇస్తుంది. నా లిస్ట్ కూడా పెద్దదిగానే ఉండడంతో నేను కూడా వెయిట్ చేస్తున్నాను. అతని సరుకులు ప్యాక్ అయ్యాయి…బిల్ 1820/- అయ్యింది, డబ్బులు ఇవ్వండి అని అడిగింది షాప్ ఓనర్…అప్పుడతను మీరే నాకు 180/- ఇవ్వాలి, నేను మీకు 2000/- ఇచ్చాను అని చెప్పాడు. నేను కూడా అప్పటి వరకు అతని చేతిలో ఉన్న 2000/- నోట్ ను చూశాను కాబట్టి ఇచ్చాడేమో…ఆంటీ మర్చిపోయిందేమో అనుకున్నాను.

అంతలోనే…షాప్ ఆంటీ కోపంతో ఊగిపోతు…బండబూతులు తిట్టుకుంటూ ఆ వ్యక్తి మీదికి దూసుకొచ్చింది. ఎన్నిసార్లు మోసం చేయాలని చూస్తావ్ రా…. నీదేం బుద్దిరా…ఇప్పటి వరకు 10 సార్లైనా ఇలా చేసుంటావ్ అంటూ చెంపమీద ఒక్కటి పీకింది అతనిని…ఇదంతా చూస్తున్న నేను ఆశ్చర్యపోయాను.! ఎంటా అని ఆరా తీస్తే తెలిసింది. వాడి పనే అదంట…చేతిలో డబ్బులు పట్టుకొని చూపిస్తాడు….కావాల్సిన సరుకులు చెబుతాడు..మనం వాటిని ఇచ్చే టైమ్ లో ఆ నోట్ ను జేబులో వేసుకుంటాడు….చివర్లో మీకే ఇచ్చాను అంటాడు…గిరాకీ హడావుడిలో ఉన్న మేం హ….ఇచ్చిఉంటాడులే అనుకునే వాళ్లం.

Customer Makes Fool To The Shop Owner-Telugu Fun Story's Viral In Social Media

ఇలాగే ప్రతిసారి చేతిలో నోటు పెట్టుకొని చూపించడం, చివర్లో ఇచ్చానని చెప్పడం చేస్తాడు. కావాలంటే చూడు నా గల్లా పెట్టెలో 2000/- నోటే లేదు…ఇతనేమో ఇచ్చానని బుకాయిస్తున్నాడని అంది. ఈలోపే సదరు వ్యక్తి అక్కడి నుండి పారిపోయాడు.