పిజ్జా ఆలస్యం అయ్యింది అని ఏకంగా ప్రాణాలే తీశాడు!  

Customer Gun Fire On The Waiter Saying The Pizza Was Late-france,pizza,police,restaurent,waiter

విదేశాల్లో గన్ కల్చర్ ఎంతగా పెరిగిపోయింది పెద్దగా వివరంగా చెప్పనవసరం లేదు.ఎందుకంటే అక్కడ చిన్న వారి నుంచి పెద్ద వారి వరకు దాదాపు అందరికి కూడా గన్ ను హ్యాండిల్ చేయడం తెలిసిఉంటుంది.ఈ క్రమంలో నిత్యం ఎదో ఒక ఘటన ఎక్కడో ఒకచోట చోటుచేసుకుంటూనే ఉంటుంది.

Customer Gun Fire On The Waiter Saying The Pizza Was Late-france,pizza,police,restaurent,waiter-Customer Gun Fire On The Waiter Saying Pizza Was Late-France Pizza Police Restaurent

తాజాగా ఫ్రాన్స్ లో పిజ్జా డెలివరీ తేవడం ఆలస్యం అయిన కారణంగా వెయిటర్ ప్రాణాలు కోల్పోవలసి వచ్చింది.ఫ్రాన్స్ రాజధాని పారిస్ లోని ఒక రెస్టారెంట్ లో ఒక కస్టమర్ పిజ్జా ఆర్డర్ చేసాడు.

Customer Gun Fire On The Waiter Saying The Pizza Was Late-france,pizza,police,restaurent,waiter-Customer Gun Fire On The Waiter Saying Pizza Was Late-France Pizza Police Restaurent

అయితే త్వరగా తన పీజ్జా తీసుకురాలేదని వెయిటర్ తో గొడవకు దిగాడు.దీనితో ఇద్దరి మధ్య వాగ్వివాదం జరుగుతుండగానే కస్టమర్ తనతో తీసుకువచ్చిన గన్ తో వెయిటర్ పై కాల్పులు జరిపాడు.దీనితో ఆ వెయిటర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయి ఒక్కసారిగా కుప్ప కూలాడు.దీనితో కాల్పులు జరిపిన కస్టమర్ వెంటనే అక్కడ నుంచి తప్పించుకొని పారిపోయాడు.

అయితే ఆ రెస్టారెంట్ లో ఉన్న కొందరు ఈ కాల్పుల శబ్దం వినిపించడం తో వెంటనే పోలీసులకు సమాచారం అందించడం తో అక్కడకి చేరుకున్నారు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.