కళ్లు చెదిరే టిప్ ఇచ్చిన కస్టమర్.. బిల్లు చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే!

మనం ఏదైనా హోటల్ లేదా రెస్టారెంట్‌కు వెళ్లినప్పుడు మనం బిల్లు కట్టిన తరువాత సర్వీసు చేసిన వెయిటర్‌కు మనకు తోచినంత టిప్ సంతోషంగా ఇస్తాం.అయితే బిల్లు ఎంత అయితే అంత టిప్ ఇస్తే వామ్మో వాళ్లు ఎంత ఆస్తిగలవారో అనుకుంటాము.కానీ ఓ వ్యక్తి మాత్రం రెస్టారెంట్‌లోని వెయిటర్‌కు ఏకంగా రూ.14500 కేవలం టిప్‌గా అందించాడు.

 Customer Gives Huge Tip To Waitress In Michigan-TeluguStop.com

ఇంతకీ ఆ కస్టమర్ బిల్ ఎంత చేశాడో తెలుసా? కేవలం రూ.1650 మాత్రమే.అంటే అతడి బిల్లుకంటే కూడా అతడు ఇచ్చిన టిప్ ఎక్కువ.మరి ఇలా ఎందుకు చేశాడని మీరు అనుకోవచ్చు.అమెరికాలోని మిచిగాన్‌ అల్పెనాకు చెందిన డేనియల్ ఫ్రాంజోని(31) అనే మహిళ కొన్ని రోజుల క్రితం స్థానికంగా ఉండే థండర్ బే రివర్ రెస్టారెంట్‌లో వెయిటర్‌గా చేరింది.ఆమె పనిలో చేరిన రెండో రోజుకే ఓ వ్యక్తి ఆ రెస్టారెంట్‌కు వచ్చి రూ.1650 బిల్లు చేశాడు.కాగా టిప్‌ కింద ఆమెకు 2020 డాలర్లు(రూ.14500) ఇచ్చి వెళ్లిపోయాడు.

ఇది చూసిన ఫ్రాంజోని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

తాను పనిలో చేరిన రెండు రోజులకే ఇలా భారీ టిప్ రావడం తనకు సంతోషంగా ఉందంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేసింది.ఏదేమైనా ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube