కోట్లాది భారతీయులతో తెగిన అనుబంధం… ఇక చరిత్ర పుస్తకాల్లోకి ‘‘అట్లాస్ సైకిల్ ’’  

Curtains For Atlas Cycles Last Manufacturing Unit Shuts - Telugu Atlas Cycle, Atlas Cycle Company Shutdown, Cycles, Haryana, Madhya Pradesh

అట్లాస్ సైకిల్.ఒకప్పుడు పేదవాడికి అది బెంజ్ కారుతో సమానం.ఇంట్లో ఇది ఉందంటే అప్పట్లో దీని యజమానులకు దక్కే గౌరవమే వేరు.70 ఏళ్లుగా కోట్లాదిమంది భారతీయుల జీవనంలో భాగమై, ఎందరికో ఎన్నో జ్ఞాపకాలను పంచిన అట్లాస్ సైకిల్ మూతపడింది.అది కూడా ప్రపంచ సైకిల్ దినోత్సవం ఇలా మూతపడటం నిజంగా దురదృష్టకరం.తన కార్మికులకు అంతర్జాతీయ సైకిల్ దినోత్సవ శుభాకాంక్షలు చెబుతూ.కంపెనీని ఇక మూసేస్తున్నాం, ఉద్యోగానికి రావొద్దని సంస్థ మేసేజ్ పంపింది.కరోనా సంక్షోభం.

 Curtains For Atlas Cycles Last Manufacturing Unit Shuts

లాక్‌డౌన్ ఎఫెక్ట్‌తో అట్లాస్ సైకిల్స్ లిమిటెడ్ ఉత్తర ప్రదేశ్ సాహిబాబాద్‌లోని కంపెనీ ఉద్యోగులకు తాత్కాలికంగా ‘‘లే ఆఫ్’’ ప్రకటిస్తూ నోటిస్ ఇచ్చింది.

అట్లాస్ కంపెనీకి 70 ఏళ్ల ఘనమైన చరిత్ర వుంది.

కోట్లాది భారతీయులతో తెగిన అనుబంధం… ఇక చరిత్ర పుస్తకాల్లోకి ‘‘అట్లాస్ సైకిల్ ’’-General-Telugu-Telugu Tollywood Photo Image

స్వతంత్ర భారతదేశపు తొలినాళ్ల బతుకు చక్రం అట్లాస్.అట్లాస్ మీద ఆఫీస్‌కి, అట్లాస్ మీద కాలేజ్‌కి, అట్లాస్‌ మీద నాన్న వెనుక సీట్లో బజారుకు.బెల్లుని ట్రింగ్ మనిపించిన బొటనవేళ్లు, హ్యాండిల్‌ని తిప్పిన జ్ఞాపకాలు ఎప్పటికీ పదిలం.1951లో ఓ చిన్న షెడ్డులో హర్యానాలో ప్రారంభమైన ఈ కంపెనీ….1965 నాటికి దేశంలో సైకిల్ తయారీలో అతిపెద్ద కంపెనీగా అవతరించింది.600 స్టోర్‌లతో, 14 రాష్ట్రాలకు కార్యకలాపాలను విస్తరించింది.ప్రతి ఏడాది 4 మిలియన్ల సైకిళ్లను ఉత్పత్తి చేసింది.1978లో ఫస్ట్ రేసింగ్ సైకిల్‌ను భారతీయులకు పరిచయం చేసింది.

అయితే గత కొన్ని సంవత్సరాలుగా సైకిళ్లు కొనుగోలు చేసే వాళ్లు తగ్గిపోవడం, దేశంలో మోటారు వాహనాల సంఖ్య పెరిగిపోవడంతో సైకిళ్ల ఉత్పత్తిని అట్లాస్ సంస్థ తగ్గిస్తూ వచ్చింది.ఈ క్రమంలో మధ్యప్రదేశ్‌లోని యూనిట్‌ను 2014లో, సొనపట్‌లోని యూనిట్‌ను 2018లో మూసివేసింది.ఇప్పుడు తాజాగా జూన్ 3న సాహిబాబాద్‌లోని చివరి యూనిట్‌ను కూడా మూసివేయడంతో సుమారు 1,000 మంది కార్మికుల కుటుంబాలు రోడ్డునపడ్డాయి.కరోనా కారణంగా కంపెనీ చాలా ఆర్ధిక నష్టాల్లో వుంది.

ముడిసరుకు కూడా కొనలేని స్థితిలో ఉన్నామని, పరిస్ధితులు చక్కదిద్దే వరకు తాత్కాలికంగా మూసివేస్తున్నామని అట్లాస్ ఓ ప్రకటనలో పేర్కొంది.ఈ వార్త ప్రపంచవ్యాప్తంగా వున్న కోట్లాది మంది భారతీయులను ఆవేదన గురిచేసింది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Curtains For Atlas Cycles Last Manufacturing Unit Shuts Related Telugu News,Photos/Pics,Images..

footer-test