చంద్ర‌బాబు వీసీలో `కరెంట్ క‌ట్`... టీడీపీలో ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌

తాజాగా టీడీపీ అధినేత చంద్ర‌బాబు .రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణుల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు.

 Current Cut In Chandrababu Vc ... Interesting Discussion In Tdp,ap,ap Political-TeluguStop.com

స్థానిక సంస్థ‌ల ఎన్నికల‌కు రంగం సిద్ధ‌మైన నేప‌థ్యంలో ఆయ‌న శ్రేణుల‌కు దిశానిర్దేశం చేసే ప‌నిని చేపట్టారు.భారీ ఎత్తున అంద‌రికీ ఆహ్వానాలు పంపారు.

కీల‌క‌మైన నాయ‌కుల‌కు ముందుగానే తెలిపారు.చంద్ర‌బాబు కూడా భారీ ఎత్తున ప్రిపేర్ అయ్యారు.

ఇంత వ‌ర‌కు బాగానే ఉంది.సుమారు మూడున్న‌ర గంట‌ల‌పాటు సాగిన ఈ వీడియో కాన్ఫ‌రెన్స్‌.

అనేక విష‌యాల‌పై చంద్ర‌బాబు ప్ర‌సంగించేందుకు చ‌క్క‌ని వేదిక అయింది.ఇటీవ‌ల కాలంలో ఆయ‌న ప్ర‌సంగించే వేదిక‌లు దొర‌క్క ఇబ్బంది ప‌డుతున్నారు.

ఈ క్ర‌మంలో వీడియో కాన్ఫ‌రెన్స్ లో త‌మ్ముళ్ల‌ను ఉద్దేశించి భారీ ఎత్తున ప్ర‌సంగాలు దంచికొడుతున్నారు.క‌రోనా నేపథ్యంలో వీసీల‌తో త‌న ఉద్దేశాలు పార్టీ లైన్‌ల‌ను.చంద్ర‌బాబు త‌మ్ముళ్ల‌కు వివ‌రిస్తున్నారు.అయితే.

ఈ లైన్‌లోనూ త‌మ‌ను విసిగించేస్తున్నార‌ని.కొన్నాళ్లుగా టీడీపీ శ్రేణులు ర‌గ‌డ చేస్తున్నాయి.

సార్‌.ఇంత సుదీర్ఘ ప్ర‌సంగాలంటే.

ఎలా అని వారు అభ్య‌ర్థ‌న‌లు కూడా పంపారు.అయిన‌ప్ప‌టికీ.

చంద్ర‌బాబు మాత్రం.తన ధోర‌ణిని వీడ‌డం లేదు.

అయితే.తాజాగా జ‌రిగిన వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా.

ఎన్నిక‌ల‌కు సంబంధించిన స‌మాచారాన్ని.చంద్ర‌బాబు త‌మ్ముళ్ల‌తో పంచుకునేందుకు రెడీ అయ్యారు.

Telugu Ap, Chandra Babu, Topic, Latest, War, Tdp, Telugu, Conferrence-Telugu Pol

అయితే.తొలి అర‌గంట చంద్ర‌బాబు ప్ర‌సంగాన్ని శ్ర‌ద్ధ‌గా విన్నారు నాయ‌కులు.రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం భారీ సంఖ్య‌లో త‌మ్ముళ్లు వీసీకి హాజ‌ర‌వుతార‌ని అనుకున్నా.

స‌గం మంది నాయ‌కులు మాత్ర‌మే వీసీకి వ‌చ్చారు.ఇక‌, వీరు కూడా మొద‌ట్లో యాక్టివ్‌గా ఉన్న‌ప్ప‌టికీ.

మ‌ధ్య‌లో వీసీ నుంచి త‌ప్పుకోవ‌డం గ‌మనా ర్హం.చిత్రం ఏంటంటే.

ఈ క్ర‌మంలో చంద్ర‌బాబుకు ఏం చెప్పాలో తెలియ‌లేదు.త‌మ‌కు ఇబ్బందిగా మారింద‌ని గ‌తంలోనే చెప్పినా.

చంద్ర‌బాబు వినిపించుకోక‌పోవ‌డంతో త‌మ్ముళ్లు వ్యూహాత్మ‌కంగా అడుగులు వేశారు.

ఒకేసారి రెండు జిల్లాల నాయ‌కులు క‌రెంటు పోయిందంటూ.

లేచి వెళ్లిపోయారు.కొంద‌రు త‌మ సిస్ట‌మ్‌లు ష‌ట్ డౌన్ అయ్యాయ‌ని సాకులు చెప్ప‌డం గ‌మ‌నార్హం.

తొలుత వీరు చెప్పిన కార‌ణాల‌ను చంద్ర‌బాబు నోట్ చేసుకున్నార‌ట‌.కానీ, త‌ర్వాత విష‌యం తెలుసుకుని షోకాజ్ నోటీసులు జారీ చేయాలంటూ.

అచ్చెన్నాయుడుని ఆదేశించిన‌ట్టు స‌మాచారం.ఇదీ.వీసీల ప‌రిస్థితి!!

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube