నోట్ల వర్షం తో భయపడుతున్న జనాలు,కారణం ఏంటంటే

ఎక్కడైనా నోట్ల వర్షం కురుస్తుంది అంటే పండగ చేసుకుంటూ ఉంటారు.కానీ ఈ కరోనా ప్రభావం కారణంగా నోట్లు రోడ్డు పై కనిపించినా కూడా ఏమాత్రం ఆ నోట్లను చూడకుండా వీలయితే అక్కడి నుంచి పారిపోతున్నారు కూడా.

 Currency Notes, Bihar, Corona Effect, Police-TeluguStop.com

కారణం కరోనా వైరస్ నోట్ల పై కూడా సజీవంగా ఉంటుంది అని అది ఇతరులకు సోకుతుంది అని హెచ్చరికలు రావడమే.ఇటీవల ఉత్తర ప్రదేశ్ లో కూడా రెండు 500 నోట్లు కనిపించినా పోలీసులకు ఫిర్యాదు చేశారేతప్ప ఆ నోట్లను మాత్రం తీసుకోలేదు.

అయితే ఇప్పుడు తాజాగా బీహార్ లో కరెన్సీ వర్షం కురిసింది.
పెద్ద ఎత్తున డబ్బులు ఇళ్ల ముందు పడడం చూసిన అక్కడి జనం ఆందోళనకు గురయ్యారు.

కారణం డబ్బుతో పాటు ఒక చీటీ కూడా ఆ నోట్ల మధ్య దొరకడం తీవ్ర కలకలం సృష్టించింది.ఆ చీటీ లో మిమ్మల్ని నాశనం చేస్తాను అంటూ హెచ్చరికలు ఉండడం తో ప్రజలు మరింత ఆందోళన చెందుతున్నారు.

ఆ చీటీ దొరికిన నేపథ్యంలో జనాలు ఇళ్ల లో నుంచి బయట అడుగుపెట్టడానికి కూడా వణికిపోయే పరిస్థితి ఏర్పడింది.బీహార్ జిల్లా సహార్స పట్టణం లో కొన్ని ప్రాంతాల్లో ఇళ్ల ముందు రూ.10,రూ.20 ,రూ.50,రూ.100 నోట్లను గుర్తు తెలియని వ్యక్తులు చల్లారు.వాటితో పాటు చీటిలో ‘నేను కరోనాతో వచ్చాను.నన్ను స్వీకరించండి.లేకపోతే మీ అందరినీ వేధిస్తాను’ అంటూ రాసి ఉంది.

Telugu Bihar, Corona Effect, Currency Notes-

వాటిని చూసిన స్థానికులు భయాందోళనకు గురైన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు వచ్చి పరిశీలించి ఆకతాయిల పనిగా భావించారు.కానీ చాలా ప్రాంతాల్లోనూ ఇలాగే దర్శనం ఇవ్వడంతో దీన్ని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు వెంటనే కేసు నమోదు చేసుకొని నోట్లను పడేసిన వారి కోసం గాలిస్తున్నట్లు సమాచారం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube