దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల చేతుల మీదుగా కరెన్సీ నగర్ ట్రైలర్ విడుదల !!!

ఉన్నతి ఆర్ట్స్ బ్యానర్ పై ముక్కాముల అప్పారావు , డా కోడూరు గోపాల కృష్ణ నిర్మిస్తున్న చిత్రం కరెన్సీ నగర్( Currency Nagar Movie )యడ్లపల్లి మహేష్, స్పందన సోమన, కేశవ, రాజశేఖర్, చాందిని , సుదర్శన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా ద్వారా వెన్నెల కుమార్ పోతేపల్లి( Vennela Kumar Pothepalli ) దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.ఆంతాలజీ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని డిసెంబర్ 29న థియేటర్స్ లో విడుదల కాబోతోంది.

 Currency Nagar Movie Trailer Released By Director Srikanth Addala , Currency N-TeluguStop.com

కరెన్సీ నగర్ సినిమాలో మనిషికి, మనీకి, నైతికతకు ఉండే బంథాన్ని, నాలుగు కథల రూపంలో చక్కగా తెరకెక్కించాడు దర్శకుడు వెన్నెల కుమార్.పాటలు, సంగీతం అందర్నీ ఆకట్టుకుంటాయని ఈ చిత్రం వర్గం చెప్పింది.

ఉత్కంఠభరితమైన కధనం, ఊహించని ముగింపు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.అన్నివర్గాల ప్రేక్షకుల్ని ఈ చిత్రం అలరిస్తుంది.

ఇటీవల విడుదలైన ఈ చిత్ర ఫస్ట్ లుక్ కు మంచి స్పందన లభించింది.తాజాగా కరెన్సీ నగర్ ట్రైలర్ ను దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల( Srikanth Addala ) విడుదల చేశారు.

ఈ సందర్భంగా దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల మాట్లాడుతూ….తెలుగులో మొదటిసారిగా వస్తోన్న అంధాలజీ సినిమా ఇది.ట్రైలర్ బాగుంది, అందరూ బాగా చేశారు, ఈ సినిమాతో దర్శకుడు వెన్నెల కిషోర్ విజయం సాధించి మంచి గుర్తింపు తెచ్చుకుంటాడాని కోరుకుంటూ చిత్ర యూనిట్ అందరికి బెస్ట్ విషెస్ తెలుపుతున్నాను అన్నారు.

నటీనటులు:

యడ్లపల్లి మహేష్, స్పందన సోమన, కేశవ, రాజశేఖర్, చాందిని , సుదర్శన్ తదితరులు.

సాంకేతిక నిపుణులు:

బ్యానర్: ఉన్నతి ఆర్ట్స్, నిర్మాతలు: ముక్కాముల అప్పారావు , డా కోడూరు గోపాల కృష్ణ , ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మురళీధర్.గుడ్లూరు, దర్శకత్వం: వెన్నెల కుమార్ పోతేపల్లి,సంగీతం: సిద్ధార్థ్ సదాశివుని, పవన్,ఎడిటర్: కార్తిక్ కట్స్,సినిమాటోగ్రఫీ: సతీష్ రాజబోయిన, సౌండ్ ఎఫెక్ట్స్: యతిరాజు

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube