పోలీసు బలగాల ముట్టడిలో ఉస్మానియా

ఉస్మానియా విశ్వవిద్యాలయం పోలీసు బలగాల ముట్టడిలో ఉంది.ఇక్కడ యుద్ధ వాతావరణం నెలకొంది.

 Curfew Situation At Ou-TeluguStop.com

చదువుల నిలయం ఉద్రిక్తంగా మారింది.ఇందుకు కారణం కొన్ని విద్యార్థి సంఘాలు తలపెట్టిన బీఫ్ ఫెస్టివల్.

దీన్నే పెద్ద కూర పండుగ అని , గొడ్డు కూర పండుగ అని అంటున్నారు.ఇంకొందరు విద్యార్థులు పంది కూర పండుగ చేయడానికి సిద్దమయ్యారు.

బీఫ్ ఫెస్టివల్ నిర్వహించకూడదని హై కోర్టు ఆదేశించినా విద్యార్థులు ఖాతరు చేయలేదు.దీంతో పోలీసు బలగాలు విశ్వవిద్యాలయాన్ని స్వాధీనం చేసుకున్నాయి.16 మంది విద్యార్థులను, ఎమ్మెల్యే రాజా సింగును అరెస్టు చేశారు.వర్సిటీలోకి ఎవ్వరినీ అనుమతించలేదు.

మీడియాను కూడా పోకుండా అడ్డుకున్నారు.కర్ఫ్యూ వాతావరణం ఏర్పడింది.

కోర్టు ఉత్తర్వుల ప్రకారం పోలీసులు ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా చూస్తున్నారు.బీఫ్ ఫెస్టివల్ నిర్వాహకుల్లో ప్రధానమైన ఎనిమిది మందిని గత రాత్రి అరెస్టు చేసినట్లు పోలీసు అధికారులు చెప్పారు.

బీఫ్ ఫెస్టివల్ జరపవద్దని వర్సిటీ అధికారులు చెప్పినా విద్యార్ధులు వినలేదు.ఉస్మానియా విద్యార్థులకు మద్దతుగా ఆంధ్రప్రదేశ్లోని గుంటూరులో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోని దళిత విద్యార్థులు బీఫ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి.

మరి అక్కడి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube