జీలకర్ర నీటితో అధిక బ‌రువుకు సులువుగా చెక్ పెట్టండి!!

అధిక బ‌రువు.నేటి కాలంలో ప్ర‌తి ఒక్క‌రూ ఎదుర్కొనే ప్ర‌ధాన స‌మ‌స్య‌.

 Cumin Water Reduce Belly Fat-TeluguStop.com

ముఖ్యంగా యువతరం మీద ఈ స‌మ‌స్య తీవ్రంగా ప్ర‌భావం చూపిస్తోంది.అయితే ఈ స‌మ‌స్య నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు నోరు క‌ట్టేసుకుని తీవ్రంగా శ్ర‌మిస్తారు.

మ‌రియు ఎన్నో ర‌కాల డైట్లు, మ‌రెన్నో ర‌కాల మందులు కూడా వాడాతారు.కానీ, ఫ‌లితం లేక బాధ‌ప‌డుతుంటారు.

 Cumin Water Reduce Belly Fat-జీలకర్ర నీటితో అధిక బ‌రువుకు సులువుగా చెక్ పెట్టండి-Telugu Health - తెలుగు హెల్త్ టిప్స్ ,చిట్కాలు-Telugu Tollywood Photo Image-TeluguStop.com

వాస్త‌వానికి మీ జీవనశైలిలో చిన్న చిన్న మార్పులు చేయడం ద్వారా సులువుగా బరువు తగ్గవచ్చు.

ముఖ్యంగా మన డైలీ డైట్‌లో జీల‌క‌ర్ర నీటిని చేర్చుకుంటే ఖ‌చ్చితంగా బ‌రువు త‌గ్గొచ్చ‌ని నిపుణులు అంటున్నారు.

జీల‌క‌ర్ర‌.ప్ర‌తి ఒక్క‌రి వంటింట్లో ఉండే ఔష‌ధం అన‌డంలో సందేహం లేదు.

వంట‌ల్లో విరివిరిగా వాడే జీల‌క‌ర్ర.చ‌క్క‌ని రుచి ఇవ్వ‌డంతో పాటు ఆరోగ్యానికి ఎన్నో ప్ర‌యోజ‌నాలు చేకూర్చుతుంది.

అలాగే బ‌రువు త‌గ్గేందుకు కూడా జీల‌క‌ర్ర గ్రేట్‌గా ప‌నిచేస్తుంది.ముందు నీటిలో జీలకర్ర వేసి బాగా మరిగించాలి.అనంత‌రం ఈ నీటిని గోరువెచ్చ‌గా ఉన్న‌ప్పుడు తీసుకోవాలి.ఇలా క్ర‌మం త‌ప్ప‌కుండా ఉద‌యం ఈ నీటిని తీసుకుంటే. జీలకర్రలోని ప్రత్యేక గుణాలు శరీరంలోని అధిక కొవ్వుని తగ్గిస్తాయి.త‌ద్వారా బ‌రువు త‌గ్గుతారు.

సాధారణంగా వ్యాయామం చేస్తే తగ్గే కొవ్వు కంటే ఈ నీటిని తీసుకోవ‌డ వల్ల కరిగే కొవ్వు మూడు రెట్లు ఎక్కువగా ఉంటుందట.ఇక‌ కేవ‌లం బ‌రువు త‌గ్గ‌డ‌మే కాదు.

మలబద్ధకం, గ్యాస్, అసిడిటీ, అజీర్తి వంటి స‌మ‌స్య‌లు కూడా త‌గ్గుముఖం ప‌డ‌తాయి.జీలకర్రలో ఉండే యాంటీఆక్సిడెంట్స్ వల్ల ఇది రోగ‌నిరోధక శ‌క్తిని పెంచుతుంది.

డయాబెటిస్ పేషెంట్లు కూడా ఈ జీల‌క‌ర్ర నీటిని తీసుకుంటే షుగ‌ర్ లెవ‌ర్స్ కంట్రోల్‌లో ఉంటాయి.

#Jeera Water #Cumin Water #Belly Fat #Weight Loss #Health Tips

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు