కొత్తిమీర సాగును తక్కువ శ్రమతో పండించే పద్ధతులు..!

భారతదేశంలో కోతిమీరను( Coriander ) ఆకుకూరగా ఎక్కువ మోతాదులో ఉపయోగిస్తారు.అంతేకాకుండా వివిధ రకాల ఔషధాలలో, పరిశ్రమలలో కూడా ఎక్కువగా వినియోగించడం వలన ఎప్పుడూ మార్కెట్లో డిమాండ్ ఉంటుంది.

 Cultivation Methods Of Coriander  Cultivation With Less Effort , Cultivation  ,-TeluguStop.com

తేమతో కూడిన వాతావరణం కొత్తిమీర సాగుకు చాలా అనుకూలం.ఎటువంటి నేలలోనైన కోతిమీర సాగు చేయవచ్చు.నేల యొక్క పీహెచ్ విలువ 6.5 నుండి 7.5 వరకు ఉండే నేలలు చాలా అనుకూలం.ఒక ఎకరం నేలలో ఆఖరి దుక్కులో పది టన్నుల పశువుల ఎరువులు, 50 కిలోల వేపపిండి, రెండు కిలోల పాసిలోమైసిస్ లిలసినస్ కలిపి కలియ దున్నాలి.

ఇక మడులను ఒక మీటరు వెడల్పు 30 సెంటీమీటర్ల పొడవు ఉండేటట్లు తయారు చేసుకోవాలి.ఒక ఎకరాకు 6 కేజీల విత్తనాలు అవసరం.అదే కేవలం వర్షాధార పంట అయితే ఎకరాకు 10 కేజీల విత్తనాలు అవసరం.నాటే సమయంలో నేలలో తేమ ఉండేటట్లు చూసుకోవాలి.

విత్తనాలను ఓ 15 గంటలపాటు నీటిలో నానబెట్టి, కార్బం డిజమ్ 50% wp మూడు గ్రాములు కలిపి కిలో విత్తనాలను శుద్ధి చేసుకోవాలి.విత్తనాలను చల్లకుండా 5 సెంటీమీటర్ల లోతులో కర్రతో సన్నని రంధ్రాలు చేసి విత్తనం వేశాక పైపైన కొంచెం మట్టివేసి ఆ తర్వాత తేలిక పాటి నీటి తడి అందించాలి.

నీటిని పారించకుండా డ్రిప్ విధానం( Drip ) ద్వారా నీటిని అందించడం వలన మొక్క కావలసిన నీరు సమృద్ధిగా అందడంతో పాటు, చాలావరకు కలుపు సమస్యలు ఉండవు.శీతాకాలంలో పది రోజులకు ఒకసారి, వేసవికాలంలో ఐదు రోజులకు ఒకసారి పంటకు నీరు అందించాలి.పైన చెప్పిన పద్ధతుల ద్వారా కొత్తిమీర సాగు చేస్తే కలుపుల ఖర్చు, రసాయన పిచికారీ ల ఖర్చు ఆదా అవడంతో పాటు నాణ్యమైన అధిక దిగుబడి( High yield ) పొంది మంచి ఆదాయం పొందవచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube