పైనాపిల్ సాగులో ప్రత్యేకత.. లాభాల స్థాయి గురించి తెలిస్తే..

ఉదర సంబంధిత సమస్యలతో బాధపడేవారు పైనాపిల్ తినాలని వైద్యులు సూచిస్తుంటారు.మార్కెట్‌లో దీని ధర కూడా అందుబాటులోనే ఉంటుంది.

 Cultivating Pineapple Anytime In The Year Cultivating , Pineappl , Formmers , S-TeluguStop.com

అయితే రైతుల్లో మాత్రం పైనాపిల్ సాగుచేసే ధోరణి ఇంకా పెద్దగా కనిపించడం లేదు.పైనాపిల్ సాగుతో కొందరు రైతు సోదరులు మంచి లాభాలు పొందుతున్నారు.

పైనాపిల్ సాగులో ఉన్న గొప్పదనం ఏమిటంటే.ఇది సంవత్సరంలో ఎప్పుడైనా సాగు చేయవచ్చు.

ఇతర పండ్ల తోటలసాగు కంటే రైతులు దీనిలో లాభాలను ఆర్జించే అవకాశం అధికంగా ఉంది.

నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం ఇది వేసవి సీజన్ పంటగా పరిగణిస్తారు.

సంవత్సరంలో ఏ సమయంలోనైనా దీనిని సాగు చేయవచ్చు.పైనాపిల్‌ను విత్తినప్పటి నుండి పండ్లు చేతికి వచ్చేనాటికి 18 నుండి 20 నెలల సమయం పడుతుంది.

పండు పండినప్పుడు దాని రంగు ఎరుపు-పసుపు రంగులోకి మారుతుంది.ఆ తర్వాత దాని కోత ప్రక్రియ ప్రారంభమవుతుంది.

పైనాపిల్ మొక్క కాక్టస్ జాతికి చెందినది.దీని నిర్వహణ చాలా సులభం.

దీంతో పాటు వాతావరణం విషయంలోనూ పెద్దగా జాగ్రత్తలు తీసుకోనవసరం లేదు.ఇంతేకాకుండా దీనికి తక్కువ నీటిపారుదల సరిపోతుంది.

పొలాల్లో కలుపు మొక్కలు పేరుకుపోకుండా జాగ్రత్తలు తీసుకుని, మొక్కలకు సరైన నీడను కల్పించాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube