జే ఎన్ యూ ఘటన సూత్రధారులు ఎవరో తేల్చి చెప్పిన ఢిల్లీ పోలీసులు

ఇటీవల జె ఎన్ యూ ఘటన సంచలనం రేపిన సంగతి తెలిసిందే.అయితే ఈ విధ్వంసానికి పాల్పడిన వారెవరో ఢిల్లీ పోలీసులు తేల్చేసినట్లు తెలుస్తుంది.

 Culprits Of Jnu Revealed-TeluguStop.com

సీసీటీవీ ఫుటేజ్ ఆధారాలతో జె ఎన్ యు ఎస్ యు నేతలు ఈ విధ్వంసానికి పాల్పడినట్లు పోలీసులు తేల్చి చెప్పేశారు.జే ఎస్ యు ఎస్ యు నేతలు అయినా అయిషి ఘోష్,ప్రియా రంజాన్,చున్ చున్ కుమార్ తదితరులే ఈ విధ్వంసానికి పాల్పడినట్లు తేల్చిన పోలీసులు వారితో పాటు మొత్తం తొమ్మిది మందిపై కేసులు నమోదు చేసినట్లు తెలుస్తుంది.

సీసీటీవీ ఫుటేజ్ ఆధారాలతో వారి ఫోటోలను కూడా రిలీజ్ చేశారు పోలీసులు.విధ్వంసానికి పాల్పడే ముందు సీసీటీవీ సర్వర్‌ని ధ్వంసం చేసే సందర్భంలో రికార్డయిన వీడియోలను, ఫోటోలను ఢిల్లీ పోలీసులు శుక్రవారం మీడియాకు రిలీజ్ చేశారు.

Telugu Cc Tv Footage, Chun Chun Kumar, Culpritsjnu, Delhi, Jsuayush, Member-

తొమ్మిది మంది అనుమానితులకు నోటీసులు జారీ చేసి, వివరణ కోరామని పోలీసులు చెప్పారు.యూనివర్సిటీ లోకి బయటి వ్యక్తులు వచ్చే అవకాశమే లేదన్న అధికారులు పక్కా ప్లాన్ ప్రకారం ఆయిషీ ఘోష్, ప్రియారంజన్, చున్ చున్ కుమార్‌లు యూనివర్సిటీలో విధ్వంసానికి పాల్పడ్డారని తేల్చారు.సీసీటీవీ కెమెరాలతో జనవరి 4వ తేదీన ధ్వంసం చేశారని జోయ్ టర్కీ వెల్లడించారు.నాలుగు వామపక్ష విద్యార్థి సంఘాలు సామూహికంగా, వ్యూహాత్మకంగా ఢిల్లీ యూనివర్సిటీలో అల్లర్లు సృష్టించాయని డీసీపీ వివరించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube