CRPF జవాన్లపై దాడి కేసులో నిందితుడైన తీవ్రవాదిని భారత్ కు అప్పగించిన UAE

2017 డిసెంబర్ 30, 31 తేదిలలో కాశ్మీర్ లోని లేత్పోరాలో CRPF క్యాంపు మీద జరిగిన దాడిలో పెద్ద కుట్ర దారుడైన, జైష్-ఏ-మహ్మద్ సంస్థకి చెందిన తీవ్రవాది నాసిర్ అహ్మద్ టాన్ ట్రె ని UAE నుండి మన దేశానికి తీసుకురావడంలో భారత్ విజయం సాధించింది.అప్పటి దాడిలో తీవ్రవాదులు భద్రతాబలగాల శిబిరంలోనికి చొరబడి నిద్రిస్తున్న మన జవాన్ల మీద కాల్పులకు తెగబడిన సంగతి తెలిసిందే.5గురు CRPF జవాన్లు ఆ దాడిలో వీరమరణం పొందారు.అలాగే జవాన్లు జరిపిన ఎదురు దాడిలో ముగ్గురు జైషే ఉగ్రవాదులు హతమయ్యారు.

 Crpf జవాన్లపై దాడి కేసులో నిందిత-TeluguStop.com

మరిగుజ్జు తీవ్రవాదిగా పిలువబడే, 4 అడుగుల ఎత్తు వుండే ఈ నాసిర్ ను UAE నుండి ఆదివారం ఉదయం డిల్లీ తెసుకొని వచ్చి, ఈ కేసును దర్యాప్తు చేస్తున్న జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) కి అప్పగించారు.ఇతను ఈ సంవత్సరం మొదట్లో UAEకి పారిపోయినట్లు అనుమానిస్తున్నారు.

ఇతని తమ్ముడు నూర్ తానే ట్రె జైష్ లేత్పురా డివిజనల్ కమాండర్ గా పనిచేసేవాడు.కాశ్మీర్ లోయలో జైష్ బాగా బలపడటానికి ఈ అన్న దమ్ములిద్దరు కారణంగా చెబుతారు.

గత కొద్ది సంవత్సరాలుగా UAE కి భారత దేశంతో మంచి సంబంధాలు నెరుపుతోంది.భారతదేశం నుండి పారిపోయి, ఆదేశంలో తలదాచు కొంటున్న తీవ్రవాదులను, అనేక మంది నేరగాళ్ళను ఇటీవల భారతదేశానికి అప్పగించింది.

ముఖుల్ చోస్కి, ముకుల్ తల్వార్ వంటి ప్రముఖులు ఉన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube