లాక్ డౌన్ అనంతరం చిత్ర పరిశ్రమ శరవేగంగా సినిమాలన్నింటిను షూటింగ్ జరుపుకుంటోంది.ఈ నేపథ్యంలోనే వరుస సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చి సందడి చేయనున్నాయి.
ఈ నేపథ్యంలోనే దర్శక నిర్మాతలు వారి సినిమా విడుదల తేదీలను వరుసబెట్టి ప్రకటిస్తున్నారు.స్టార్ హీరోల నుంచి చిన్న హీరోల వరకు సినిమా విడుదల తేదీలను ఇప్పటికే తెలియజేశారు.
అయితే తాజాగా ఈ సినిమా విడుదల తేదీ అందరినీ ఎంతో ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
తాజాగా విడుదలైన ఈ సినిమా విడుదల తేదీ పోస్టర్ అందరినీ ఎంతగానో ఆకట్టుకునే ఆశ్చర్యానికి గురి చేసింది.
ఈ పోస్టర్ లో అక్టోబర్ 1న విడుదల అంటూ కుర్చీలో కర్చీఫ్ వేస్తున్నటువంటి ఫోటో మనకు కనిపిస్తుంది.అంతేకాకుండా ఫస్ట్ లుక్ లేదు, హీరో పిక్ లేదు, హీరోయిన్ ఎవరో తెలియదు, ఏ బ్యానర్లో ఓ చిత్రం నిర్మిస్తున్నారు తెలియదు, దర్శకుడు పేరు రాయలేదు, షూటింగ్ డేట్ ఫిక్స్ అవ్వలేదు, నిర్మాత పేరు లేదు కానీ అక్టోబర్ 1న విడుదల అంటూ కుర్చీలో కర్చీఫ్ వేస్తూ ఉన్నటువంటి ఈ పోస్టర్ అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.
ఈ పోస్టర్ చూసిన నెటిజన్లు సదరు చిత్ర బృందం ఈ సినిమా ఎవరిది అనే ఆలోచనలో పడ్డారు.ఈ పోస్టర్ చూసిన సదరు నెటిజన్లు ఈ సినిమా త్వరలోనే హీరో గోపీచంద్, మారుతి కాంబినేషన్లో తెరకెక్కే సినిమా ఉంటుందని ప్రచారం జోరుగా జరుగుతోంది.
అయితే ఇదివరకే మారుతి_గోపీచంద్ కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతుంది అనే సమాచారం మనకు తెలిసింది.అయితే ఈ అక్టోబర్ 1న విడుదల పోస్టర్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే మరికొన్ని రోజులు వేచి ఉండాల్సిందేనని భావిస్తున్నారు.