ఇదేందయ్యా ఇది: పవర్ కట్ ఐపీఎల్ లో ఇంత పని చేసేసింది..!

బీసీసీఐ ని వేల కోట్ల ఆదాయాన్ని తెచ్చిపెడుతున్న అత్యంత ఖరీదైన లీగ్ ఐపీఎల్ అనడంలో ఎలాంటి సందేహమూ లేదు.అయితే.

 Csk Unable To Use Drs Against Mi Due To Power Cut In Wankhade Stadiun In Tata Ip-TeluguStop.com

తాజాగా ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన ఘటన ఐపీఎల్, బీసీసీఐ దిగజారేలా చేసింది.ప్రపంచ క్రికెట్ లో ఫేమస్ లీగ్ లో పవర్ కట్ సమస్య వల్ల ఫలితం తారుమారు అయింది.

దీంతో ఐపీఎల్ 2022 సీజన్ ప్లేఆఫ్స్‌ రేసు నుంచి చెన్నై సూపర్ కింగ్స్ గురువారం రాత్రి నిష్క్రమించింది.

ముంబైలోని వాంఖడే స్టేడియంలో సాంకేతిక సమస్యల కారణంగా చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్ టాస్ ఆలస్యమైంది.

ఫ్లడ్‌ లైట్స్ వెలగకపోవడంతో దాదాపు 5 నిమిషాల పాటు ఇరుజట్ల కెప్టెన్లు ఎదురుచూడాల్సి వచ్చింది.పవర్ కట్ కారణంగా ఆ జట్టు తొలి రెండు ఓవర్లలో డీఆర్‌ఎస్ తీసుకునే అవకాశం లేకపోయింది.దీంతో ముంబయి ఇండియన్స్‌తో వాంఖడే వేదికగా జరిగిన మ్యాచ్‌లో బ్యాటింగ్, బౌలింగ్‌లో తేలిపోయిన చెన్నై టీమ్.5 వికెట్ల తేడాతో చిరకాల ప్రత్యర్థి చేతిలో ఓడిపోయింది.దాంతో.ముంబయితో పాటు చెన్నై కూడా ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకుని ఇంటిబాట పట్టబోతోంది.

ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ ఓపెనర్‌ డెవాన్‌ కాన్వే ఔటైన తీరు వివాదాస్పదంగా మారింది.సీఎస్‌కే ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌లో డానియల్‌ సామ్స్‌ వేసిన రెండో బంతి.

స్ట్రైక్‌లో ఉన్న డెవాన్‌ కాన్వే ప్యాడ్‌ను తాకింది.

Telugu Ccsk, Chennai, Csk Mi, Devon Convoy, Wankhadestadiun, Unable Drs, Latest-

వెంటనే బౌలర్‌తో పాటు ఫీల్డర్లు ఎల్బీకు అప్పీలు చేయగా.అంపైర్‌ ఔట్‌ అని వేలు పైకెత్తాడు.అయితే ఆశ్చర్యకరంగా వాంఖడే స్టేడియంలో పవర్ కట్ కారణంగా.

కాన్వేకు రివ్యూ తీసుకునే అవకాశం దక్కలేదు.కాన్వే తన భాగస్వామి రుతురాజ్ గైక్వాడ్‌తో కలిసి అంపైర్‌లతో మాట్లాడాడు.

కానీ అంపైర్‌లు మాత్రం ఔట్‌గానే నిర్ధారించారు.దీంతో డకౌట్‌గా కాన్వే వెనుదిరిగాడు.

అయితే బంతి క్లియర్‌గా లెగ్‌ స్టంప్‌ను మిస్‌ అవుతున్నట్లు అన్పించింది.రెండు ఓవర్ల అనంతరం పవర్ సమస్య తీరగా.

రివ్యూలు అందుబాటులోకి వచ్చాయి.ఇక సోషల్‌ మీడియాలో ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube