సోషల్ మీడియాలో వైరలవుతున్న చెన్నై టీం వీరాభిమాని పెళ్లి పత్రిక..ఇంతకీ ఆ పెళ్లి కార్డులో ఏం ఉందంటే?     2018-09-16   05:58:04  IST  Rajakumari K

మన దేశంలో క్రికెట్ కి,క్రికెటర్స్ కి ఉన్నంత క్రేజ్ మరే దానికి ఉండదంటే అతిశయోక్తి కాదేమో..ఐపిఎల్ వచ్చిన తర్వాత ప్లేయర్స్ కే కాదు,ఆ టీమ్స్ కి కూడా వీరాభిమానులు ఉన్నారు. వాళ్లు ఏదో ఒక రకంగా తమ అభిమానాన్ని చాటుకుంటూ ఉంటారు. తాజాగా ఐపీఎల్ టీమ్ చెన్నై సూపర్ కింగ్స్, ఆ టీమ్ కెప్టెన్ ఎమ్మెస్ ధోనీ వీరాభిమాని అయిన కే. వినోద్ అనే వ్యక్తి తన పెళ్లిపత్రికను వెరైటీగా ప్రింట్ చేయించాడు… ఈ పత్రికను చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీయే తమ ట్విటర్‌లో పోస్ట్ చేయడం విశేషం…

అచ్చంగా చెన్నై హోమ్ మ్యాచ్ టికెట్ రూపంలో ఈ వెడ్డింగ్ ఇన్విటేషన్ ఉండటం చాలా మందిని ఆకర్షిస్తున్నది.ధోనీ, చెన్నై టీమ్‌కు వీరాభిమానిగా ఏదైనా కొత్తగా చేయాలని భావించాను. అందుకే నా పెళ్లిపత్రికను ఇలా వెరైటీగా ప్రింట చేయించాను.

CSK Match Ticket-Inspired Wedding Invitation Card by a MS Dhoni's Fan-CSK Match Ticket-Inspired Wedding Invitation Card,CSK Wedding Card Ticket,MS Dhoni's Fan,Wedding Invitation Card By A MS Dhoni's Fan

సీఎస్‌కే అభిమాని, గ్రాఫిక్ డిజైనర్ అయిన నా ఫ్రెండ్ సాయంతో ఈ పత్రికను డిజైన్ చేయించాను అని వినోద్ చెప్పాడు. చెన్నై సూపర్ కింగ్స్‌కు సంబంధించిన ఎన్నో వీడియోల్లో వినోద్ ఉన్నాడు. అతనికి ధోనీ తాను ఆటోగ్రాఫ్ చేసిన బ్యాట్‌ను బహుమతిగా కూడా ఇచ్చాడు…వినోద్ పెళ్లి పత్రికను చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ తమ అధికారిక ట్విటర్లో పోస్ట్ చేసింది.. కోసం క్లిక్ చేయండి..