వైరల్‌ వీడియో : తండ్రి డ్యూటీకి పోతున్న సమయంలో పిల్లాడి ఏడుపు, హృదయం ద్రవించడం ఖాయం

పిల్లలకు అభంశుభం తెలియదు, వారు అనుకున్నవి కావాలని పట్టుబడుతూ ఉంటారు.పరిస్థితులను వారు అర్థం చేసుకోరు.

 Crying Son Stopping His Cop Father From Leaving-TeluguStop.com

వారి సంతోషం వారికి ముఖ్యం.ఏదైనా కావాలి అంటే తల్లిదండ్రుల ఆర్ధిక పరిస్థితి, అక్కడ ఉందా లేదా అనే విషయాన్ని ఆలోచించరు.

అలా ఆలోచించే శక్తి వారికి ఉండదు.వారిని పెద్దలు మెల్లగా ఏదో ఒక విషయానికి డైవర్ట్‌ చేసి వారికి ఆ విషయం మళ్లీ గుర్తు రాకుండా చేయాలి.

కాని తల్లిదండ్రులు లేకుండా ఉన్న పిల్లలను కంట్రోల్‌ చేయడం అంటే మామూలు విషయం కాదు.తాజాగా ఒక పోలీస్‌ అధికారి తన పిల్లాడిని వదిలించుకుని డ్యూటీకి వెళ్లేందుకు ప్రయత్నించాడు.

కాని ఆ బాబు మాత్రం ఎంతకూ తండ్రిని డ్యూటీకి వెళ్లేందుకు ఒప్పుకోలేదు

తండ్రి యూనిఫామ్‌ వేసుకుని రెడీ అయ్యి డ్యూటీకి వెళ్తున్నాడు.ఆ సమయంలోనే బాబు తండ్రి కాళ్లు పట్టుకుని బలవంతంగా తండ్రిని వెళ్లకుండా అడ్డుకుంటున్నాడు.

తండ్రి డ్యూటీకి వెళ్తే మళ్లీ ఎప్పుడు వస్తాడో అని ఆ బాబు గుక్కపట్టి ఏడుస్తూనే ఉన్నాడు.ఎంతగా చెప్పి చూసినా కూడా అతడు తండ్రి కాళును మాత్రం వదలడం లేదు.

కేవలం అర నిమిషం నిడివి ఉన్న ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో సెన్షేషన్‌ అవుతోంది.
కేవలం పోలీసు ఉద్యోగస్తులు మాత్రమే కాకుండా ప్రతి ఒక్క ఉద్యోగస్తుడు కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నట్లుగా జనాలు చెబుతున్నారు.ముఖ్యంగా ఆర్మీ వారు మరియు పోలీసు వారు అత్యంత కఠిన పరిస్థితులు ఎదుర్కొంటూ ఉంటారు.వారి పిల్లలను వదిలేసి మానసిక క్షోభను అనుభవిస్తూ ఉంటారు.

కొన్ని రోజుల సెలవులతో పిల్లల వద్దకు వెళ్తే వారు, తిరిగి వెళ్లాల్సిన సమయం వచ్చినప్పుడు మాత్రం వారిని పిల్లలు వదలకుండా పట్టుకుంటారు.అందుకే పిల్లలు నిద్రపోయినప్పుడు లేదా మరి ఎటు వెళ్లినప్పుడు అయినా తండ్రులు బయటకు వెళ్తూ ఉంటారు.

ప్రస్తుతం ఈ వీడియో జనాల హృదయంను ద్రవిస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube