చితక్కొట్టుకున్న మహిళలు.. నేలకేసి కొట్టిన సెక్యూరిటీ అధికారి

అమెరికాలోని టెక్సాస్‌ రాష్ట్రం శాన్ ఆంటోనియో నైట్‌క్లబ్ ( San Antonio Nightclub )వెలుపల హింసాత్మక ఘటన జరిగింది.

దిగ్భ్రాంతికరమైన సంఘటనలో నైట్‌క్లబ్ భద్రతా అధికారి ఓ మహిళను పైకి ఎత్తి నేలకేసి బలంగా కొట్టాడు.

దీంతో బాధిత మహిళ బాధతో విలవిల్లాడింది.తొలుత @leooooo69 అనే ట్విట్టర్ ఖాతా ద్వారా దీనిని పోస్ట్ చేయగా బాగా వైరల్ అవుతోంది.

ఆ వీడియోను పరిశీలిస్తే క్లబ్ వెలుపల కొందరు మహిళలు ఒకరిపై మరొకరు దాడులు చేసుకుంటున్నారు.జుట్టుపట్టుకుని చితక్కొట్టుకున్నారు.

ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు.ఇంతలో ఓ సెక్యూరిటీ ఆఫీసర్( Security Officer ) అక్కడకు వచ్చాడు.

Advertisement

ఓ మహిళను అమాంతంగా పైకెత్తి విసిరేశాడు.దీంతో సదరు సెక్యూరిటీ ఆఫీసర్ తీరుపై నెటిజన్లు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు.

ట్విట్టర్‌లో ఈ వీడియోకు 11 మిలియన్లకు పైగా వ్యూస్ దక్కాయి.ఓ మహిళను కొట్టి అదే సెక్యూరిటీ అధికారి మరో మహిళపై పెప్పర్ స్ప్రే ( Pepper spray )చేయడం కూడా వీడియోలో ఉంది.చాలా మంది గార్డులు ఉన్నప్పటికీ గొడవ పడుతున్న మహిళలను విడదీయడానికి చూడలేదు.

పైగా ఓ అధికారి ఓ మహిళను కొట్టడం వీడియోలో చూడొచ్చు.దీనిపై ప్రైవేట్ సెక్యూరిటీ కంపెనీ ప్రెసిషన్ డిఫెన్స్ గ్రూప్ స్పందించింది.

కేవలం ఇద్దరు గార్డులు మాత్రమే అక్కడ జరిగే గొడవను ఆపడానికి ప్రయత్నించారని, పోలీసులు వచ్చే వరకు వేచి ఉన్నారని పేర్కొంది.మహిళను కొట్టడానికి ముందు ఏం జరిగిందో తెలుసుకుంటున్నామని, విచారణ పూర్తైన తర్వాత స్పందిస్తామని పేర్కొంది.

రాజమౌళి వల్లే టాలీవుడ్ హీరోలకు ఈ స్థాయిలో గుర్తింపు.. నమ్మకపోయినా నిజమిదేనా?
రైతు పండుగ :నేడు రేవంత్ చెప్పనున్న ఆ రెండు శుభవార్తలు ఏంటి ? 

ఏదేమైనా ఆ మహిళను నేలకేసి కొట్టడాన్ని నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు.భద్రత అధికారి చేసిన పనిని తప్పుపడుతున్నారు.

Advertisement

గొడవ పడుతున్న మహిళలను ఆపకుండా, తిరిగి వారిపై దాడి చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు.ఇటువంటి గార్డులను పెట్టుకున్న కంపెనీపై కూడా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

తాజా వార్తలు