లండన్ లో దారుణ హత్యకు గురైన హైదరాబాదీ వ్యక్తి

లండన్ లో హైదరాబాదీ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు.లండన్ సూపర్ మార్కెట్ కేఫ్ లో పని చేస్తున్న హైదరాబాద్ కు చెందిన మొహమ్మద్ నజీముద్దీన్ అనే వ్యక్తి ని అతడితో కేఫ్ లో పని చేసే మరో వ్యక్తి హత్య చేసినట్లు అధికారులు భావిస్తున్నారు.

 Cruelly Murdered Hyderabad Person In London-TeluguStop.com

గత ఆరేళ్లుగా నజీముద్దీన్ కేఫ్ లో పని చేస్తున్నాడు.అలానే అతని భార్య కూడా లండన్ లోనే డాక్టర్ గా పని చేస్తుండడం తో గత ఆరేళ్లుగా వారు లండన్ లోనే నివాసం ఉంటున్నట్లు తెలుస్తుంది.

అయితే అతడితో కలిసి కేఫ్ లో పనిచేసే వ్యక్తి నజీముద్దీన్ పై కత్తితో దాడిచేసి దారుణంగా హత్య చేసినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.ప్రస్తుతం అతడిని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు అధికారులు.

అయితే అసలు ఏ కారణం చేత అతడిపై కత్తితో దాడి చేశాడు అన్న దానిపై ఎలాంటి సమాచారంలేదు.ఈ ఘటనకు గల కారణాల పై అధికారులు విచారణ చేపట్టారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube