వైరల్: ఉన్నట్టుండి పెద్దఎత్తున మరణిస్తున్న కాకులు.. కారణం ఏంటంటే?

కొన్ని సార్లు మూగ పక్షుల మరణం ప్రతి ఒక్కరిని కలచివేస్తుంది.అసలు అంత దారుణంగా ఎలా మరణిస్తున్నాయి? అనే అనుమానం కలుగుతుంది.ఇప్పుడు కూడా అలాంటి అనుమానమే కలుగుతుంది.తాజాగా తమిళనాడులోని పనపాక్కం సమీపంలో కాకులు పెద్దఎత్తున మరణిస్తూ ఉండటంతో ఎందుకు మరణిస్తున్నాయి అనే కారణాన్ని కనుక్కోవడం కోసం ఆరోగ్య శాఖ అధికారులు రంగంలోకి దిగారు.

 Corona Effect, Crows Death, Tamilnadu, Hungry Deaths-TeluguStop.com

పూర్తి వివరాల్లోకి వెళ్తే.పన్నియార్ గ్రామంలోని కులత్తుమేడు ప్రాంతంలో ఈ నెల 1వ తేదీన ఏకంగా 10 కాకులు మరణించి కనిపించాయి.

దీంతో అక్కడ ప్రజలంతా కూడా ఈ కాకుల మరణానికి లాక్ డౌన్ ఏ కారణం అని.ఆహారం లేక కాకులు మరణించి వుంటాయని అందరూ అభిప్రాయపడ్డారు.అయితే ఆ కాకుల మరణాలు రోజురోజుకు పెరగడంతో ఆరోగ్యశాఖ అధికారులకు తెలిసింది.

దీంతో ఆ కాకుల మరణానికి అసలు కారణం ఏంటి అని ఆరోగ్యశాఖ అధికారులు బృందం రంగంలోకి దిగింది.

అయితే స్థానికులు మాత్రం కాకులకు ఏదో వైరస్ సోకింది అని.అందుకే ఆ కాకులు మరణిస్తున్నాయి అని మరికొందరు భయపడుతున్నారు.మరి ఆరోగ్యశాఖ అధికారులు ఈ కాకుల మరణం వెనుక రహస్యాన్ని కనుకుంటారో లేదో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube