సూసైడ్ చేసుకోబోతున్న ఎలుకను కాపాడిన కాకి.. చక్కర్లు కొడుతున్న వీడియో!

సాధారణంగా కాకులు ఎలుకలను ఇష్టంగా తింటాయి.చనిపోయిన ఎలుకలను కూడా ఏరుకుని మరీ అవి లాగించేస్తుంటాయి.

 Crow Saved The Rat Which Is Going To Suicide Viral Video Details,  Viral Latest,-TeluguStop.com

కానీ ఒక కాకి మాత్రం దొరికిన ఎలుకను ఏమీ చేయలేదు సరికదా దాని ప్రాణాలను కాపాడింది.ఒక రోడ్డుపై కార్లు శరవేగంగా ప్రయాణిస్తుండగా ఓ ఎలుక ఆ రోడ్డు దాటడానికి ప్రయత్నించింది.

సరిగ్గా అది రోడ్డు దాటుతున్న సమయంలోనే కార్లు వేగంగా దూసుకెళ్తున్నాయి.అయినప్పటికీ ఆ ఎలుక సూసైడ్ చేసుకోబోతున్నట్లుగా కార్ల టైర్ల కింద పడడానికి ముందుకు వెళుతూనే ఉంది.

అయితే ఆ ఎలుక పచ్చడి కాకుండా ఓ కాకి దేవుడిలా వచ్చి కాపాడింది.ఇలా చాలా సార్లు ఆ కాకి ఎలుక తోకని పట్టుకుని వెనక్కి లాగింది.

దాంతో కాకి దయాగుణం పుణ్యమా అని ఆ ఎలుక బతికిపోయింది.

కాకి ఎలుకను కాపాడుతున్న దృశ్యాలకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Organik.Paylasimlar అనే ఒక ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ఈ వీడియోని షేర్ చేసింది.

ఈ వీడియో పోస్ట్ కి నన్ను చావనివ్వు అన్నట్టు క్యాప్షన్ జోడించింది.ఇదే వీడియోను యూట్యూబ్ లో కూడా షేర్ చేశారు.

కాగా ఈ వీడియోలను చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు.దయాగుణం చాటుకున్న కాకిని తెగ పొగిడేస్తున్నారు.

ఎలుక ని చూడగానే గుటుక్కున మింగే కాకులను చూశాము కానీ ఇలా ఎలుక ప్రాణాలను కాపాడే కాకులను ఇప్పటి దాకా చూడలేదు అన్నట్లు కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.అయితే ఈ సంఘటన విదేశాల్లో జరిగినట్లు తెలుస్తోంది.

గతంలో కూడా రోడ్డు దాటుతున్న ఎలుకలు, పందికొక్కులు చచ్చిపోకుండా కాకులు సహాయం చేశాయి.అంతేకాదు ఇతర పెద్ద జంతువులు కూడా చిన్న జంతువులను కాపాడి తమకు కూడా జాలి, దయా ఉన్నాయని చెప్పకనే చెప్పాయి.ఆ వీడియోలు కూడా అప్పట్లో బాగా వైరల్ అయ్యాయి.ఏది ఏమైనా ఒక కాకి ఎలుకను కాపాడటం నిజంగా ఆశ్చర్యకరమైన విషయమే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube