పాపం: తన ముక్కే.. తనకు ముప్పు.!

ఒక్కోసారి మనం తీసుకున్న గోతిలో మనమే పడతాం అన్నట్లు కొన్ని సంఘటనలు చూస్తే ఇట్లే అర్థం అవుతుంది.అలాగే ఒక్కోసారి మనకున్న వస్తువులు కానీ, ఏదైనా పరిస్థితులు కానీ చూస్తే మన మీద మనకే జాలి వేస్తుంది.

 Crow Nose Problem, Nose, Crow, Viral Post, Social Media-TeluguStop.com

ఇక పోతే ఇలాంటి సంఘటన ఒకటి ఓ కాకి కి జరిగింది.

ఇక అసలు విషయంలోకి వెలితే… తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ లో ఉన్న బోయపల్లి శివారులో ఓ దృశ్యం కెమెరా కంటికి చిక్కింది.

ఆ చిత్రంలో కనిపిస్తున్న కాకి ముక్కు బాగా గమనించండి.చూశారుగా ఆ కాకి ముక్కు ఎంత పొడవుగా.చంద్రాకారంలో వంకర తిరిగి ఉందో… కాకపోతే అలా ఉండడమే ఆ కాకి ఒక్క ఆకలిని తీర్చ లేకపోయింది.అసలు ఆ కాకి పైభాగం అర్ధచంద్రాకారంలో పొడవుగా, కింది భాగం చిన్నగా ఉండడంతో తనకు లభించిన ఆహారాన్ని తినలేక నానా అవస్థలు పడింది.

ఆ ప్రాంతంలో ఓ రోడ్డు పై చచ్చి పడి ఉన్న తొండ ను తినడానికి ఆ కాకి నానా తిప్పలు పడింది.కానీ, చివరకు ఆ కాకి ఎన్ని తిప్పలు పడిన కూడా ఆ తొండను నోట్లోకి తీసుకోలేక పోయింది.

దీనితో చేసేదేమి లేక తన కడుపు నిండకుండానే ఆ కాకి అక్కడి నుండి ఎగిరిపోయింది పాపం.నిజంగా ఆ కాకి ఎంత ఇబ్బంది పడుతుందో కదా తన ముక్కుతో.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube