పుల్వామా లో చొరబడ్డ ఉగ్రవాదులు....భద్రతా దళాల ఎదురుకాల్పులు  

Cross Fire In Pulwama-pulwama,pulwama Atatck,terrorists,ఉగ్రవాద సంస్థ

జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామా లో ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. నిత్యం ఉగ్ర చర్యలతో అల్లాడుతూన్న జమ్మూ కాశ్మీర్ లో మరోసారి ఉగ్రవాదులు చొరబడ్డారు. పుల్వామా లోని దాలిపొర ప్రాంతంలో ఉగ్రవాదులు దాకున్నట్లు భద్రతాదళాలకు సమాచారం దీనితో భారత సైనికులు,ప్రత్యేక పోలీస్ బలగాలు అప్రమత్తమై గాలింపు చర్యలు చేపట్టారు..

పుల్వామా లో చొరబడ్డ ఉగ్రవాదులు....భద్రతా దళాల ఎదురుకాల్పులు-Cross Fire In Pulwama

ఈ క్రమంలో భద్రతా దళాల పై ఉగ్రవాద సంస్థకు చెందిన కొందరు మిలిటెంట్లు కాల్పులు జరపడం తో భద్రతా బలగాలు ఎదురు కాల్పులు జరిపారు. గురువారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఉగ్రవాదులకు,భద్రతా బలగాలకు మధ్య భీకర కాల్పులు జరుగుతున్నాయి.

ఈ ఘటనకు సంబందించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది. జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామా లో తరచూ ఉగ్రవాద సంస్థ ల కదలికలు ఎక్కువగా ఉంటున్నాయి. గత కొంత కాలంగా నిత్యం ఆ జిల్లా లో ఏవో ఒక ఉగ్రచర్యలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి.

ఇటీవల జమ్మూ కాశ్మీర్ లోనే ఎన్నికలకు రెండు రోజుల ముందు కూడా బీజేపీ నేత ను దారుణంగా కాల్చి చంపిన ఘటన చోటుచేసుకున్న సంగతి గుర్తు ఉండే ఉంటుంది. భద్రతా దళాలు ఎంత అప్రమత్తంగా ఉన్నప్పటికీ సరిహద్దు ప్రాంతం కావడం తో ఉగ్రవాదులు చొరబాట్లు ఎక్కువై పోయాయి. ప్రస్తుతం భద్రతా దళాలు,ఉగ్రవాదులకు మధ్య కాల్పులు కొనసాగుతుండగా, మధ్య లో ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.

అయితే ఈ ఘటనలో ఏదైనా ప్రాణ నష్టం జరిగింది, ఎంత మంది ఉగ్రవాదులు ఉన్నారు అన్న వివరాలు మాత్రం తెలియాల్సి ఉంది.