కే‌సి‌ఆర్ సంచలన నిర్ణయం: ఇకపై మీ పంట మీ ఇష్టం

ఇక నుండి రైతులు పండించిన పంటను ఎక్కడ లాభం వస్తుందో అక్కడ అమ్ముకోవచ్చని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.నూతనంగా తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలు కూడా అవే చెబుతున్నాయని కరోనా కారణంగ రైతులు నష్టపోవొద్దని ప్రతి గ్రామాల్లో ఐ‌కే‌పి కేంద్రాలను ఏర్పాటు చేసి దాన్యం కొనుగోలు చేసిందని, అందువల్ల ప్రభుత్వం 7,500 కోట్లు నష్టపోయిందని తెలంగాణ ముఖ్యమంత్రి అన్నారు.

 Crop Purchases In Telangana Rural Areas,trs,raithubandu,farmmer Acts,ikc,kcr,pra-TeluguStop.com

కొన్న పంటకు మార్కెట్ లో సరైన ధర లేకపోవడంతో ఈ మేరకు నష్టంవచ్చిందని అన్నారు.వచ్చే ఏడాది నుండి రైతులు పండించిన పంటను ప్రభుత్వం కొనుగోలు చెయ్యదని  వ్యాపార సంస్థకాదని అన్నారు.

అయితే ఈ విషయంపై నిన్నఆదివారం నాడు కే‌సి‌ఆర్ ప్రగతిభవన్ లో ఉన్నత స్థాయి సమీక్షా సమేశం నిర్వహించి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలంగాణ సి‌ఎం‌ఓ ఓ ప్రకటనను విడుదల చేసింది.ఈ సమేవేశంలో పంట కొనుగోళ్ళు, నియంత్రిత సాగు, మార్కెట్లో వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకాలు–కొనుగోళ్లు, రైతుబంధు సమితుల బాధ్యతలు పలు అంశాలపై చర్చించినట్లుగా తెలుస్తుంది.

నేటినుండి తెలంగాణ రైతులకు రైతుబందు సాయం అందనున్నదని కే‌సి‌ఆర్ తెలియజేశాడు.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube