అరెరె... జాగ్రత్తగా రోడ్డు దాటుతున్న మొసళ్లను చూశారా మీరు...?

గడచిన ఆరు నెలలుగా కరోనా వైరస్ వ్యాప్తి ప్రపంచవ్యాప్తంగా తీవ్రంగా ఉండడంతో ప్రజలు అందరూ కూడా ఇళ్లకే పరిమితమయ్యారన్న సంగతి అందరికి తెలిసిందే.కరోనా వైరస్ వ్యాప్తి అవుతుండడంతో మనుషులు లాక్ డౌన్ కారణంతో ఇళ్లకే పరిమితం కావడంతో, అడవుల్లోని వన్యప్రాణులకు కాస్త స్వేచ్ఛ దొరికినట్లు కావడంతో… అవి కాస్త ఊర్లోకి, ఇళ్లలోకి ప్రవేశిస్తున్నాయి.

 Crocodiles, Water Bridge, River, Road, Coronavirus-TeluguStop.com

కొన్ని ప్రాంతాలలో వన్యప్రాణులు మనుషులు తిరిగే చోట ప్రవేశించి ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి.

తాజాగా ఇలాంటి సంఘటనే ఒకటి అమెరికాలో చోటు చేసుకుంది.

నిజానికి అదో వంతెన రోడ్డు.ఆ వంతెన ఓ నది పై నిర్మించారు.

అయితే ఆ నదిలో ఉండే మొసళ్లు ఒక్కసారిగా వంతెన పైకి వచ్చి రోడ్డుపై ఉన్న వాహనాలకు ఆటంకం కలిగించాయి.నిజానికి ఆ వంతెన కింద నుంచే ఆ మొసళ్ళు ఈదుకుంటూ వెళ్ళవచ్చు.

కానీ అవి ఆ వంతెన వరకు ఈదుకుంటూ వచ్చి ఆ తర్వాత వంతెన మీద నుండి నడుచుకుంటూ రోడ్డును దాటి మరి అవతలి వైపుకు నడుచుకుంటూ వెళ్లాయి.దీనితో వాహన దారులు కూడా బ్రేక్ ఇచ్చి కాస్త నెమ్మదిగా రోడ్డు దాటడం మొదలుపెట్టారు.

ఇక మరి కొంతమంది వాహనదారులు అయితే… వాటిని వీడియోలు తీస్తూ సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేశారు.ఇలా మొత్తం మూడు మొసళ్లు ఆలా రోడ్డును దాటాయి.

ఇలా వెళ్తున్న వాటిని అక్కడివారు ఫేస్ బుక్ లో షేర్ చేసిన వీడియోస్ నెటిజెన్స్ ను బాగా ఆకట్టుకుంటున్నాయి.ఈ వీడియోకు నెటిజన్స్ మొసళ్ళు నీటిలోనే కాదు బయట కూడా వేగంగా వెళ్లగలవు అంటూ కామెంట్ చేయగా, మరికొందరు వారి స్టైల్ లో కామెంట్లు చేశారు.

అయితే నీటిలో ఉండే వన్యప్రాణులు ఇలా రోడ్లపైకి వచ్చి ఎవరికీ ఆటంకం కలిగించకుండా, ఎవరి జోలికి రాకుండా అలా వెళ్లడంపై వాహనదారులు కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేశారు.ముసళ్ళకి ఆలా రోడ్డుపైకి వచ్చి వెళ్లడం ఇష్టమేమో మరి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube