ఊళ్లోకి వచ్చిన మొసలి, ఆందోళనలో గ్రామస్థులు, చివరకు!

దేశ వ్యాప్తంగా మొన్నటి వరకు వర్షాలు జోరుగా కురిశాయి.ఆ రాష్ట్రం, ఈ రాష్ట్రం అని కాకుండా ప్రతి చోట వానలు కురిశాయి.

 Crocodile Was Rescued By The Forest Department Team In Roorkee In Uttarakhand Details, Cocodile Enter Village, Crocodile Rescued Video, Crocodile Viral Video, Uttarakhand, Haridwar, Solani River, Heavy Rains-TeluguStop.com

భారీ వానలతో జన జీవనం అస్తవ్యస్తం అయింది.వారాల తరబడి బీభత్సంగా కురిసిన వానతో చెరువులు, కుంటలు నిండి బయటకు మత్తళ్లు పారాయి.

వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహించాయి.నదుల్లో నీటి ప్రవాహ గణనీయంగా పెరిగింది.

 Crocodile Was Rescued By The Forest Department Team In Roorkee In Uttarakhand Details, Cocodile Enter Village, Crocodile Rescued Video, Crocodile Viral Video, Uttarakhand, Haridwar, Solani River, Heavy Rains-ఊళ్లోకి వచ్చిన మొసలి, ఆందోళనలో గ్రామస్థులు, చివరకు-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఎక్కడ చూసిన నీళ్లే ఉన్నాయి.దీంతో నీటిలో నివసించే మొసళ్లు అలా అలా ఇతర ప్రాంతాలకు వెళ్తున్నాయి.

ఉత్తరాఖండ్ లో అలాగే.నదిలో నుండి నీటి ప్రవాహంతో ఓ మొసలి ఖాళీ ప్రదేశంలో నిలిచిన నీటిలోకి వచ్చి చేరింది.ఈ మొసలి ఒక్కసారిగా బయటకు రావడంతో స్థానికులు హడలి పోయారు.అది ఉత్తరాఖండ్.

హరిద్వార్ లోని ఇబ్రహీంపూర్ ప్రాంతం.ఖాళీ ప్రదేశంలో నిలిచిన నీటిలో ఉన్న మొసలి బయటకు రావడం చూసిన స్థానికులు హడలి పోయారు.

వెంటనే స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.గ్రామస్థులు ఇచ్చిన సమాచారంతో అక్కడికి చేరుకున్న అధికారులు.

మూడు గంటల పాటు శ్రమించి మొసలిని పట్టుకున్నారు.

Telugu Crocodile Enter, Crocodile, Haridwar, Heavy, Solani River, Uttarakhand-Latest News - Telugu

గ్రామానికి సమీపంలోని సొలాని నదిలో మొసళ్లు ఉన్నాయని.ఇటీవల కురిసిన వర్షాలకు గ్రామంలోకి వచ్చినట్లు అధికారులు గుర్తించారు.అధికారులు పట్టుకున్న మొసలికి వైద్య పరీక్షలు చేసిన అనంతరం.

నదిలో వదిలిపెట్టనున్నారు అటవీ శాఖ అధికారులు. ఖాళీ ప్రదేశంలో ఉన్న నీళ్లలో ఎలాంటి జాగ్రత్తలు లేకుండా అస్సలే వెళ్లవద్దని, మొసళ్లతో పాటు ఇతర క్రిమి కీటకాలు ఉండే ప్రమాదం ఉంటుందని అధికారులు సూచిస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube