వైరల్ వీడియో: మాంసం తినడానికి నోటికి ఇవ్వలేదని అలిగి నీటిలోకి వెళ్లిపోయిన మొసలి...!

తాజాగా ఓ మొసలి తనకు అందించే చికెన్ ముక్క తినకుండా అలిగి నీటిలోకి వెళ్లిపోయిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే… అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం లో ఉన్న ఎవర్‌గ్లేడ్స్‌ హాలిడా పార్కు లో ఈ సంఘటన చోటు చేసుకుంది.

 The Crocodile That Went Into The Water Saying That The Meat Was Not Given To The-TeluguStop.com

అయితే అసలు విషయం ఏమిటంటే.సదరు మొసలి పేరు సెవెన్.

అయితే అక్కడ ఉన్న మొసళ్ల ను సంరక్షించుకునే ఓ జంట ఆ ముసలి కి చికెన్ ముక్క పెట్టాలని భావించారు.అయితే వారు మామూలుగా ఇస్తే ఏం సరదా ఉంటుందని అనుకొని డైరెక్టుగా ఇవ్వకుండా అందుకో చూద్దామంటూ ఆ మొసలిని ఆట పట్టించారు జంట.

ఇలా ఆటపట్టించిన సమయంలో మొసలి కూడా చికెన్ ముక్కను అందుకోవడానికి గట్టిగానే ప్రయత్నం చేసింది.అయితే మొసలి కి అంత సులువు కాలేదు.

అయితే అంతలోనే ఆ యువకుడు తన చేతిలోని చికెన్ ముక్కను నేలపై వదిలేశాడు.ఇక కింద పడిన చికెన్ ముక్కలను తీసుకోవడానికి వెళ్లే సమయానికి అది కాస్త మట్టిలో పడిపోయింది.

ఇక ఆ తర్వాత మొసలిని సరదాగా అయ్యో నువ్వు పట్టుకోలేకపోయావే నువ్వు ఫెయిల్ అయ్యావు అని కామెంట్ చేశారు.

అయితే ఆ మాటలు ఆ మొసలి కి ఏం అర్థం అయ్యాయో తెలియదు కానీ, ఆ మొసలి బాగా ఫీల్ అయ్యి వెంటనే చికెన్ ముక్కను అక్కడే వదిలేసి నీటిలోకి వెళ్ళిపోయింది.

ఇది చూసిన ఆ జంట ఆ మొసలి ని మళ్లీ ఓదార్చి, మళ్లీ మాంసం ముక్కను చూపిస్తూ వారి వైపు పిలిచారు.ఇంకేముంది అంత ముద్దుగా పిలిస్తే ముసలి కూడా ఆనందంగా నీటిలోనుంచి వారి దగ్గరకు వచ్చి మాంసాన్ని తినేసింది.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.అయితే ఈ వీడియో కొద్ది రోజుల క్రితం తీసింది, కాకపోతే ఇప్పుడిప్పుడే బాగా ప్రాచుర్యం పొందుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube