వైరల్ వీడియో : పాపం మొసలి ప్లాన్ ఫెయిల్ అయ్యింది..

కొన్ని వీడియోలు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటాయి.వీడియోలో ఏదొక ఇంట్రెస్టింగ్ విషయం ఉంటే అది జనాల దృష్టిని ఆకర్షిస్తుంది.

 Crocodile Failed To Attacks A Zebra, Crocodile Videos, Zebra Videos, Viral Video-TeluguStop.com

అలాంటిదే ఇప్పుడు మనం చెప్పుకోబోయే వీడియోలో చోటుచేసుకుంది.

ఈ వీడియోలో మొసలి జీబ్రాను వేటాడాలని ప్లాన్ వేసింది.

కానీ చివరకు దాని ప్లాన్ ఫెయిల్ అవ్వడంతో ఆ కోపమంతా నీటిపై చూపిస్తూ లోపలి వెళ్ళింది.జీబ్రాను తినేద్దామని ఆశపడ్డ మొసలికి చివరకు నిరాశే ఎదురయింది.

టైమింగ్ పర్ఫెక్టుగా లేకపోవడంతో మొసలి వేసిన ప్లాన్ మిస్సయ్యింది.అడవిలో వేటాడేటప్పుడు కరెక్ట్ టైమింగ్ లేకపోతే ఎంతటి పెద్ద జంతువులకయినా వేసిన ప్లాన్ రివర్స్ అవ్వాల్సిందే.అంతేకాదు వేటాడడానికి బలమైన ఉండాలి లేదా బుద్ధి కుశలత అయినా ఉండాలి.

మొసలిలాంటి జంతువుకయితే నీటిలో ఉండే చేపలు లాంటివి ఈజీగా దొరుకుతాయి.

కానీ నేలపై ఉండే జంతువులూ ఒకసారి దొరికితే మరొకసారి ఎస్కేప్ అవుతాయి.మొసలిలాంటి జంతువుకయినా వ్యూహం కరెక్ట్ గా లేకపోతే బెడిసి కొట్టాల్సిందే.

ఈ వీడియోలో ఒక జీబ్రా నీళ్ళు తాగడానికి నదికి వచ్చింది.నీరు తాగి పైకి వెళ్ళేటప్పుడు ఒక ముసలి జీబ్రాను నీటిలోకి లాగేందుకు ప్రయత్నించింది.జీబ్రా నీరు తాగేంతసేపు మొసలి కదలకుండా ఉండి.సరిగ్గా పైకి వెళ్ళేటప్పుడు జీబ్రా కాలును కోరికేయాలని అనుకుంది మొసలి.

కానీ కొద్దిలో తప్పించుకుంది జీబ్రా.

జీబ్రాను పట్టుకోలేకపోయానని మొసలి కోపంతో రగిలిపోయింది.ఆహారం దొరకలేదని ఆ కోపమంతా నీళ్లపై చూపించింది.ఇదంతా తెలియని జీబ్రా తన దారిన తాను వెళ్ళిపోయింది.

ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ వీడియో నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది.ఎందుకంటే మొసలి బారి నుండి జీబ్రా తప్పించుకుంది నెటిజన్లు చాలా సంతోషపడుతున్నారు.

అందుకే ఈ వీడియో ను తెగ షేర్ చేసేస్తున్నారు.కొంతమంది లైక్లు, కామెంట్స్ చేస్తూ ఆనందపడుతున్నారు.

https://twitter.com/DoctorAjayita/status/1355851512208007169
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube