గుడి లోకి వచ్చిన మొసలి... పూజారి మాటవిని వెనకడుగు?

Crocodile, Kerala Temple, Leaves, Priests Request, Crocodile In Water, Ananthapuram Temple, Crocodile Aliyas Baliya, Crocodile Security For Temple, Social Media

సాధారణంగా మొసలి నీళ్లలో నివసించే జీవి అయినప్పటికీ, కొన్నిసార్లు బయట దర్శనమిస్తుంటుంది.అయితే నీటిలో ఉన్నప్పుడు దాని బలం రెట్టింపవుతుంది.

 Crocodile, Kerala Temple, Leaves, Priests Request, Crocodile In Water, Ananthapu-TeluguStop.com

నీటిలో ఉన్న మొసలిని చూడగానే ఒక్కసారిగా భయం తో ఒళ్లు జలదరిస్తుంది.అలాంటి మొసలి ఏకంగా ఒక గుడిలో ప్రత్యక్షమయేతే ఎలా ఉంటుంది? ఒక్కసారిగా వెన్నులో వణుకు పుట్టి అక్కడినుంచి పారిపోతాము.కానీ ఇక్కడ ఒక పూజారి ఏ మాత్రం భయపడకుండా మొసలి ని చూడగానే నమస్కరించి ఇక్కడి వెళ్లిపోమని కోరగా ఆ మొసలి పూజారి మాటలు విని వెనక్కు వెళ్ళిపోయిన ఘటన ప్రస్తుతం వైరల్ గా మారింది.

కేరళలోని కసరగడ్ జిల్లాలో గల అనంతపుర దేవాలయంలో ఈ అద్భుతమైన ఘటన చోటు చేసుకుంది.

అయితే ఈ ముసలి మిగతా మొసలి లాగా క్రూరమైనది కాదు, ఇది మాంసాహారం సేవించదు, ఈ మొసలి ని’బలియా’ అని పిలుస్తారు.అంతేకాకుండా ఈ మొసలి నిత్యం గుడి దగ్గరే ఉండి గుడికి కాపలా కాస్తు, గుడిలో పెట్టే ప్రసాదాన్ని తింటుందని అక్కడ పూజారి తెలిపారు.

గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ మొసలి గుడి బయట మాత్రమే కాపలాగా ఉండేది.కానీ ఇన్నేళ్లలో మొదటిసారిగా ఈ ముసలి గుడిలోకి ప్రవేశించిందని అక్కడ ప్రధాన అర్చకులు తెలిపారు.

మొసలి గుడిలోకి రావటంతో సోషల్ మీడియాలో మాత్రం ముసలి గర్భగుడిలోకి ప్రవేశించే ఉందని తెలిపారు.అయితే ఆ ముసలి కేవలం గుడిలోకి మాత్రమే ప్రవేశించిందని, గర్భగుడిలోకి ప్రవేశించిందని చెప్పడం కేవలం అపోహ మాత్రమే అని అక్కడి పూజారి తెలిపారు.

అయితే ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.

పురాణాల లో నుంచి ఈ మొసలి ప్రాచుర్యంలో ఉందని అక్కడి స్థానికులు చెబుతారు.

ఈ గుడికి కాపలాగా ఉన్న ఒక ముసలి నీ బ్రిటిష్ వారు చంపడంతో దాని తర్వాత మరొక మొసలి ఇక్కడికి కాపలాగా వస్తూ ఉండేది.అలా ప్రతిసారి ముసలి చనిపోయిన తర్వాత మరొక మొసలి గుడికి కాపలాగా రావడం ఎంతో విశేషం.

ఈ ముసలి ఎవరికీ ఎటువంటి హాని చేయకుండా కేవలం గుడికి మాత్రమే కాపలాగా ఉంటుందని ప్రధాన అర్చకులు చంద్రప్రకాష్ తెలియజేశారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube