గోల్ఫ్ కోర్టు లోకి ప్రవేశించిన మొసలి... సోషల్ మీడియా లో వైరల్

గోల్ఫ్ కోర్టు లోకి ఒక అనుకోని అతిధి వచ్చింది.కానీ ఆ అతిధి ఎవరో తెలిస్తే మాత్రం మీ గుండె జల్లు మనక మానదు.

 Crocodile Entered Into The Golf Course Viral In Social Media-TeluguStop.com

ఇంతకీ ఆ అతిధి ఎవరంటే మొసలి.నిజంగానే దక్షిణ ఫ్లోరిడా లోని బోణీత నేషనల్ గోల్ఫ్ అండ్ కంట్రీ క్లబ్ గ్రౌండ్స్ లో అనుకోని అతిధి గా మొసలి వచ్చిన ఈ ఘటన చోటుచేసుకుంది.

అసలు నిజానికి మొసలిని మనం దూరం నుంచి చూస్తేనే భయంతో గుండెలు జారిపోతాయి.అలాంటి మొసలి గోల్ఫ్ కోర్టు లోకి అనుకోని అతిధిగా ప్రవేశించడం తో అక్కడ జనాలు అందరూ ఆశ్చర్యం తో పాటు భయభ్రాంతులకు గురయ్యారు.

గోల్ఫ్ కోర్టు లోకి ప్రవేశించ�

ఈ ఘటన ఏప్రిల్ 30 వ తేదీన చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.అలా గ్రౌండ్ లోకి అడుగుపెట్టిన మొసలి కి సంబందించిన దృశ్యాలను పక్కనే ఉన్న లోరి అనే మహిళ తన కెమెరాలో రికార్డ్ చేసింది.అయితే మూడు కాళ్లే ఉన్న ఆ మొసలి కొద్దీ దూరం వెళ్లిన తరువాత కుప్పకూలిన ఘటన ఆ దృశ్యాల్లో స్పష్టంగా కనిపిస్తుంది.అయితే గత నెల 30 న చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబందించి వీడియో ను ఆ మహిళ సోషల్ మీడియా లో పోస్ట్ చేయడం తో ఇప్పుడు ఆ వీడియో వైరల్ గా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube