వైరల్.. మూసీ నదిలో మొసలి.. స్థానికులు ఏం చేసారంటే!

మనకు మొసలి పేరు వింటేనే భయం కలుగుతుంది.ఎందుకంటే దాని బలం ముందు మన బలం ఏ పాటిది.

 Crocodile Creates Panic In Hyderabad Moosi River Details, Crocodile, Hyderabad,-TeluguStop.com

సాధారణంగా మొసలి నీళ్లలో నివసించే జీవి అయినప్పటికీ, కొన్నిసార్లు బయట దర్శనమిస్తూ ఉంటుంది.అయితే నీటిలో ఉన్నప్పుడు దాని బలం మాములుగా కంటే ఎక్కువ ఉంటుంది.

అలా నీళ్లల్లో ఉన్నప్పుడు ఆ మొసలి ఎవరి మీద అయినా ఎటాక్ చేస్తే ఇక వాళ్ళను కాపాడడం దాదాపు కష్టమే.అంత పట్టు ఉంటుంది దాని చేతుల్లో.

చూస్తూ చూస్తూనే మనుషులను అమాంతం నోటిలో వేసుకోగల సామర్థ్యం కలిగి అంటుంది.

అందుకే మనకు మొసలి పేరు ఎత్తితేనే వణుకు మొదలవుతుంది.

ఇక దానిని అనుకోకుండా చుస్తే గుండె జారీ చేతిలో పడుతుందేమో.తాజాగా భాగ్యనగరం లోని మూసీ నదిలో మొసలి కనిపించడం కలకలం రేపింది.

స్థానికులు మొసలిని చూడడంతో బయపడి పోయారు.వారు వెంటనే అధికారులకు సమాచారం అందించారు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.

భాగ్యనగరం లోని మూసీ నదిలో ఒక మొసలి కనిపించి స్థానికులను భయబ్రాంతులకు గురి చేసింది.

హైదరాబాద్ లో నిన్న భారీ వర్షాలు కురిసాయి.

Telugu Crocodile, Crocodilemusi, Gandipeta, Hiayath Sagar, Hyderabad, Musi River

దీంతో ఈ భారీ వర్షానికి నగరంలో లోతట్టు ప్రాంతాలు అన్ని జలమయం అయ్యాయి.హిమాయత్ సాగర్, గండిపేట జలాశయాలకు భారీ వరద నీరు వచ్చి చేరడంతో గేట్లు ఎత్తి వేశారు.

దీంతో ఈ వరద నీరు అంత మూసీ నదిలోకి వచ్చి చేరింది.

ఆ నీటితో పాటు మొసలి కూడా కొట్టుకు వచ్చిందనుకుంటా.ఈ మొసలి స్థానికుల కంట్లో పడడంతో భయంతో వెంటనే అధికారులను సమాచారం అందించారు.

అధికారులు వెంటనే అక్కడికి చేరుకుని ఆ మొసలిని పట్టుకుని జూ కు తరలించడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.ఇక ఈ రోజు కూడా భారీ వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ చెప్పడంతో అధికారులు అలెర్ట్ అయ్యారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube