వైరల్ వీడియో: నీటి కోసం వచ్చిన చిరుత ను మొసలి ఏం చేసిందంటే..?!

కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయం నుండి ప్రపంచం నలుమూలలా ఎన్నో రకాల వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న మనం గమనిస్తూనే ఉన్నాం.ఇందులో భాగంగానే ఎన్నో రకాల జంతువులు, పక్షులకు సంబంధించిన వీడియోలు వైరల్ గా మారుతూ ఉండడం గమనిస్తూనే ఉన్నాం.

 Viral Video, Social Media, Leopard, Crocodile, What The Crocodile Did To The Leo-TeluguStop.com

ఇందులో భాగంగానే తాజాగా మరో వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతోంది.ఈ వీడియోలో ఓ అడవిలో చిరుతపులి నీటిని తాగేందుకు చెరువు దగ్గరికి వచ్చిన సమయంలో ఆ చెరువులో ఉన్న మొసలి రెప్పపాటు క్షణంలో చిరుత పిల్లను నోటికి కరుచుకుంది.

ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే…

మనందరికీ తెలిసిందే మొసలి ఒక్కసారి పట్టు పట్టింది అంటే దాని నుంచి వదిలించుకోవడం అంత సులువైన విషయం కాదు.చిన్నప్పటి నుంచి మనకు ఎన్నో కథలను విన్న వాటిలో ఒకటిగా మొసలి నీటిలో ఉన్నప్పుడు దాని బలం వెయ్యి ఏనుగుల బలానికి సమానంగా ఉంటుందని.

తాజాగా దక్షిణాఫ్రికాలో ఓ అడవిలో చిరుతపులి పిల్ల నీరు తాగేందుకు ఆ అడవిలో సమీపంలో ఉన్న సరసు వద్దకు చేరుకుని నీటిని తాగుతూ ఉంది.చిరుత పులి పిల్ల నీరు సాగుతున్న సమయంలో అప్పటికే ఓ 13 అడుగులకు పైగా ఉన్న ఓ మొసలి ఒక్కసారిగా చిరుత పై మెరుపు దాడి చేసింది.

ఇక అంతే ఆ మొసలి యొక్క బలమైన దవడలతో చిరుత మెడను నోటకరచుకొని నీటిలోకి తీసుకొని వెళ్ళింది.అయితే అదే సమయంలో దక్షిణాఫ్రికా వైల్డ్ ఎర్త్ సఫారీ కి చెందిన గైడ్ లు ఇద్దరు ఆ చిరుత పులి సంబంధించి వీడియో తీస్తున్న సమయంలో అనుకోకుండా ఈ సంఘటన జరగడంతో వారు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.నీరు తాగేందుకు వచ్చిన చిరుత పులి పిల్లను ఆ పెద్ద మొసలి లాక్కొని వెళ్లడం చాలా బాధాకరమైన సంఘటన వారు తెలియజేశారు.ఇకపోతే ఆ చిరుత పిల్ల తల్లి ఒడ్డు నుండి అంతా గమనిస్తున్న తల్లి చిరుతపులి ఏమి చేయలేక బాధతో ఆ సరస్సు ఒడ్డున అటు ఇటు తిరిగింది.

ఆ సరస్సులో ఉన్న మొసలి నైల్ జాతికి చెందిన మొసలి.ఇవి చాలా పెద్దగా, చాలా శక్తివంతంగా ఉంటాయి.ఈ తతంగానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ గా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube