షర్మిల రాజకీయం ... జగన్ పై జనాల సెటైర్లు 

తెలంగాణ రాజకీయాల్లో తనదైన శైలిలో దూసుకుపోతున్న వైఎస్ షర్మిల తన పార్టీని జనాల్లోకి తీసుకు వెళ్లేందుకు చాలా ప్రయత్నాలే చేస్తున్నారు.అసలు తెలంగాణ లో షర్మిల పార్టీ పెట్టడమే ఒక సాహసం అని చెప్పుకోవాలి.

 Criticisms On Sharmila Referring To The Jagan Topi Ys Sharmila, Telangana, Trs,-TeluguStop.com

ఎందుకంటే పెద్దగా ఆమెకు అక్కడ రాజకీయ విషయాలపై అవగాహన లేకపోవడం,  ఇప్పటికీ ఆంధ్రా ప్రాంతం వ్యక్తిగానే ఆమెను చూస్తున్నారు.  వైఎస్.

రాజశేఖర్ తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా వ్యవహరించడం, షర్మిల సోదరుడు జగన్ ముఖ్యమంత్రిగా ఉండడం ఎన్నో అంశాలు షర్మిల రాజకీయానికి స్పీడ్ బ్రేకర్లు గా మారాయి.అసలు ఆమె తెలంగాణలో పార్టీ పెట్టినా, పెద్దగా ప్రభావం చూపించలేరని, రాజకీయంగా ఆమెకు ఎన్నో ఇబ్బందులు వచ్చి పడతాయని అందరూ ముందుగానే ఊహించారు.
      అయితే షర్మిల మాత్రం పూర్తిగా టిఆర్ఎస్ ను టార్గెట్ చేసుకుని ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపుతూ విమర్శలు చేస్తున్నారు.ఏదోరకంగా కనీసం పదుల సంఖ్యలో సీట్లను సంపాదించాలనే లక్ష్యంతో ఉన్నారు.

అందుకే టిఆర్ఎస్ తమను పట్టించుకున్న,  పట్టించుకోకపోయినా జనాల్లోకి వెళ్లాలని, ఏదో ఒక అంశంపై టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడమే లక్ష్యంగా వ్యవహరించాలని షర్మిల చూస్తున్నారు.ప్రస్తుతం నిరుద్యోగ అంశాన్ని షర్మిల లేవనెత్తారు.

ప్రతి మంగళవారం అదే విషయం పై పోరాటం చేస్తూ, ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగులు కుటుంబాలను పరామర్శిస్తునే ప్రభుత్వంపై విరుచుకు పడుతున్నారు.
 

Telugu Ap Cm Jagan, Congress, Telangana, Ys Sharmila, Ysrcp, Ysrtp-Telugu Politi

     సరిగ్గా షర్మిల ఏ అంశాలపై అయితే టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్నారో అదే అంశాలను ప్రస్తావిస్తూ జగన్ ను ట్రోల్ చేస్తున్నారు.తెలంగాణలో సరే ఏపీ లో ఉద్యోగాలు భర్తీ చేయమని మీ అన్నను అడగవా షర్మిలా అంటూ నెటిజన్లు ట్రొల్ చేస్తున్నారు.కృష్ణా జలాల విషయంలో తెలంగాణ ప్రయోజనాలు ముఖ్యం అంటూ షర్మిల మాట్లాడడాన్ని ప్రశంసిస్తూనే, జగన్ అంశాన్ని ప్రశంసిస్తూ ఇరుకునపెట్టేందుకు ప్రయత్నిస్తున్న తీరు వివాదాస్పదంగా, ఇబ్బందికరంగా మారింది.

షర్మిల ఏ అంశంపై అయితే టిఆర్ఎస్ ప్రభుత్వం ను షర్మిల ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారో అదే అంశం పై జగన్ కు సెటైర్ లు పడుతున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube