కోహ్లీ కెప్టెన్సీపై విమ‌ర్శ‌లు.. అండ‌గా నిలిచిన రైనా..!

టీమిండియా సారథి విరాట్ కోహ్లీపై ప్రస్తుతం అక్కడక్కడ విమర్శలు వినిపిస్తున్నాయి.వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ ఓడిపోవడం ఆయన ఖాతాలోకి వస్తుందని కొందరు ఆరోపణలు చేస్తున్నారు.

 Criticisms On Kohlis Captaincy Raina Who Stood For Virat, Kohli, Raina, Kohli Ca-TeluguStop.com

విరాట్ కోహ్లీ సారథ్యంలో భారత్ భవిష్యత్తు గురించి జోస్యాలు చెప్తున్నారు.ఈ క్రమంలో ఆయనకు నిలిచిన క్రికెటర్ ఎవరు? కోహ్లీ కెప్టెన్సీ ఎన్ని ఫార్మాట్లలో కొనసాగనుంది? టీమిండియా ఫ్యూచరల్ ఎలా ఉండబోతుంది? వంటి ఇతర విషయాల గురించి ఎవరెవరు ఏమనుకుంటున్నారు?

టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌లో విరాట్ సారథ్యంలో భారత ఆటగాళ్లు ఆరంభంలో రాణించినా సత్తా చాటలేకపోయారు.ఈ ఓటమిపై అంతటా విమర్శలు రావడంతో పాటు విరాట్ కెప్టెన్సీనే ప్రశ్నిస్తున్నాయి.ఇక టెస్టు కేప్టెన్‌గా విరాట్ కోహ్లీ 33 విజయాలు సాధించిన సంగతి అందరికీ తెలిసిందే.

ఈ విషయమై భారత మాజీ బ్యాట్స్‌మన్ సురేశ్ రైనా స్పందించారు.కోహ్లీకి ఇంకొంత సమయం కావాలని, ఆయన చేతుల మీదుగా ఒక్కసారైనా భారత్ ఐసీసీ ట్రోఫీ అందుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపాడు.ఫైనల్ మ్యాచ్‌లో పరిస్థితులను బట్టి ఆటగాళ్లు రాణించలేకపోయారని చెప్పాడు.

Telugu India, Kohli, Kohli Captaincy, Raina, Suresh, Championship-Latest News -

కొన్నిసార్లు కొన్నింటిని కోల్పోవాల్సి వస్తుందన్నాడు.మ్యాచ్ సమయంలో రెండ్రోజుల పాటు భారీ వర్షం పడిందని, దాంతో మ్యాచ్ రద్దు అయిపోయిందని గుర్తుచేశాడు రైనా.నాలుగు సెషన్స్‌లో బ్యాటింగ్ చేయాల్సి ఉంది.

కానీ, ఇండియా సెకండ్ ఇన్నింగ్స్ 170 పరుగులు మాత్రమే చేసిందని తెలిపాడు.న్యూజిలాండ్ టార్గెట్‌ను ఈజీగా ఛేదించిందని, అలా వారు ట్రోఫీని గెలుచుకున్నారని తెలిపాడు.

అయితే, ఈ ప్రదర్శనలో సీనియర్ బ్యాట్స్‌మెన్ మరికొంచెం బాధ్యతాయుతంగా వ్యవహరిస్తే బాగుండేదని రైనా అభిప్రాయపడ్డారు.

Telugu India, Kohli, Kohli Captaincy, Raina, Suresh, Championship-Latest News -

కోహ్లీ ప్రపంచంలోనే నెం.1 కెప్టెన్ అని, ఆయన రికార్డులే చెబుతాయన్నారు.ఆయన ఏం సాధించాడో తెలుసుకోవాలంటే రికార్డు చూస్తే చాలు.

అందరికీ ఆయన గొప్పతనం తెలిసిపోతుందన్నారు.వరల్డ్ కప్ మ్యాచ్‌లు ఒక దాని తర్వాత మరొకటి వెనువెంటనే జరుగుతున్నాయి.

ఈ క్రమంలో రెండు టీ20 వరల్డ్ కప్‌లు, 50 ఓవర్ల వరల్డ్ కప్ ఫైనల్ చేరుకోవడం అంత సులువేం కాదని తెలిపాడు రైనా.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube