సారూ ... కారు: లచ్చల్ లచ్చల్ కోట్లు ? వాళ్ల సంగతేంటి ? 

ఎంత ఎన్నికలు అయితే మాత్రం, అసలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అప్పులు వీటన్నిటిని లెక్కలోకి తీసుకోకుండా లక్షల లక్షల కోట్లు ఒకే నియోజకవర్గానికి కుమ్మరించేలా తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం పై అనేక అనుమానాలు, సెటైర్లు వినిపిస్తున్నాయి.హుజూరాబాద్ నియోజకవర్గం లో ఉన్న ప్రతి దళిత కుటుంబానికి ప్రభుత్వం తరఫున 10 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందించే ఏర్పాటు చేయడం, దీని కోసం లక్షల కోట్లు కేటాయిస్తూ ఉండడం దేశ వ్యాప్తంగా సంచలనం గానే మారింది.

 Criticisms On Kcr Looking To Spend Heavily For The Dalit Bandhu Scheme-TeluguStop.com

కేవలం ఒక నియోజకవర్గంలో గెలుపు కోసం కేసీఆర్ ఎంత భారీ హామీని ఎలా ఇచ్చారు అనే సందేహాలు ఎన్నో అందరిలోనూ అలుముకుంటున్నాయి.

ఇది ఒక్క నియోజకవర్గానికి పరిమితం కాదని , రాబోయే రోజుల్లో రాష్ట్రమంతా ఈ పథకాన్ని అమలు చేస్తామని కేసీఆర్ చెబుతుండడం మరింత సంచలనమే కాకుండా, మరెన్నో అనుమానాలకు తావిస్తోంది.

 Criticisms On Kcr Looking To Spend Heavily For The Dalit Bandhu Scheme-సారూ … కారు: లచ్చల్ లచ్చల్ కోట్లు వాళ్ల సంగతేంటి  -Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కేవలం దళిత ఓటు బ్యాంక్ ను దగ్గర చేసుకునేందుకు కేసీఆర్ ఇంతగా ప్రయాసపడుతున్నారా అనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.కేవలం ఆ సామాజిక వర్గానికి మేలు చేస్తేనే హుజురాబాద్ లో గెలుస్తామని కేసీఆర్ భావిస్తే, ఆయా సామాజిక వర్గాల పరిస్థితి ఏమిటనేది ఇప్పుడు తెరపైకి వచ్చింది.

దళితుల ప్రయోజనాలను కాపాడేందుకు,  వారిని ఆర్థికంగా ఆదుకునేందుకు రైతుబంధు పథకం ప్రవేశ పెట్టడం తప్పు కాకపోయినా, ఇంత భారీ బడ్జెట్ తో కూడుకున్న పథకాన్ని కేవలం ఒక దళితులకు మాత్రమే పరిమితం చేయడం , మిగిలి సామాజిక వర్గాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారిని పట్టించుకోకపోవడంపైనే ఇప్పుడు చర్చ జరుగుతోంది.

Telugu Bjp, Dalitha Bandu, Etela Rajender, Hujurabad Elections, Kcr, Telangana, Telangana Budget, Trs-Telugu Political News

తెలంగాణలో గిరిజనులతో పాటు,  ముస్లింలు, మిగిలిన కులాల్లోనూ ఎంతో మంది నిరుపేదలు ఉన్నారు.అయితే ఇప్పుడు వారంతా టిఆర్ఎస్ ప్రభుత్వం పై అసంతృప్తి వ్యక్తం చేసే అవకాశం లేకపోలేదు.కులాల వారీగా విభజిస్తూ భారీ బడ్జెట్ తో కూడుకున్న పథకాలను ప్రవేశపెట్టి రాజకీయంగా లబ్ధి పొందాలని అనుకోవడం రాజకీయ నాయకుల అభిప్రాయం ప్రకారం తప్పు కాకపోయినా, కేవలం ఒక వర్గానికి మాత్రమే పరిమితం చేస్తున్నారని , తమ సామాజిక వర్గం ఓట్లు కేసీఆర్ కు అవసరం లేదా అనే ఫీలింగ్ కలిగితేనే అసలు చిక్కు మొదలవుతుంది.

అసలు ఈ దళిత బంధు ను సక్సెస్ ఫుల్ గా అమలు చేయడం సాధ్యమా ? మిగిలిన అన్ని నియోజక వర్గాల్లో దీనిని అమలు చేయాలి అంటే కావాల్సిన లక్షల లక్షల కోట్లు ఎక్కడి నుంచి తెస్తారు ? హుజూరాబాద్ మినహా మిగిలిన ప్రాంతాల్లో ఈ పథకం గతంలో కేసీఆర్ ప్రకటించిన దళిత సీఎం, దళితులకు మూడు ఎకరాలు పథకం మాదిరిగానే తయారవుతుందా అనే సందేహాలు అందరిలోనూ అలుముకున్నాయి.

#Dalitha Bandu #Etela Rajender #Telangana

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు