ఇదేంటి రెడ్డి గారు ? ఇంత వెటకారం అవసరమా ? 

చంద్రబాబు నాయుడు గారికి హార్దిక శుభాకాంక్షలు.ఆ దేవుని ఆశీస్సులతో నిండు ఆరోగ్యంతో మీరు సంతోషంగా ఉండాలని ఆశిస్తున్నాను.’ అంటూ ఏపీ సీఎం జగన్ హుందాగా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, తన రాజకీయ బద్ధ శత్రువు నారా చంద్రబాబు నాయుడు కి పుట్టినరోజు సందర్భంగా చెప్పిన శుభాకాంక్షలు.రాజకీయంగా, వ్యక్తిగతంగా వీరిద్దరి మధ్య ఎంతటి శత్రుత్వం ఉన్నా, వాటిని పక్కనపెట్టి జగన్ హుందాగా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పి,  అంతే హుందాగా తన వ్యక్తిత్వాన్ని కాపాడుకున్నారు.

 Criticisms Of Vijayasaireddys Attitude Towards The Way Chandrababu Was Told On His Birthday-TeluguStop.com

ఇదేవిధంగా మరెంతో మంది వైసీపీ నాయకులు చంద్రబాబు కు శుభాకాంక్షలు తెలియజేస్తూ,  ఆయన ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్నారు.అయితే వైసీపీ రాజ్యసభ సభ్యుడు, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఉత్తరాంధ్ర జిల్లాల ఇంచార్జి విజయసాయి రెడ్డి మాత్రం చంద్రబాబు కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

సొంత పార్టీ నాయకులు సైతం విజయసాయిరెడ్డి విధానాన్ని తప్పు పడుతున్నారు ఏపీలో ఆఫీసులు మూసేయడంతో,  పక్క రాష్ట్రంలో పుట్టినరోజు జరుపుకుంటున్న 420 కి జన్మదిన శుభాకాంక్షలుఅంటూ విజయసాయిరెడ్డి  తన ట్విట్టర్ లో వెటకారం గా చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలియజేశారు.  దీనికి #HbdTelugu420CBN అంటూ హ్యాష్ ట్యాగ్ కూడా తగిలించడం తో ఇది కాస్తా వైరల్ అయింది.

 Criticisms Of Vijayasaireddys Attitude Towards The Way Chandrababu Was Told On His Birthday-ఇదేంటి రెడ్డి గారు ఇంత వెటకారం అవసరమా  -Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

స్వయంగా ఏపీ సీఎం జగన్ చంద్రబాబుకు హుందాగా శుభాకాంక్షలు చెబితే,  విజయసాయిరెడ్డి మాత్రం పుట్టినరోజున కూడా చంద్రబాబు పై ఉన్న అక్కసును చూపిస్తూ,  ఈ విధంగా శుభాకాంక్షలు చెప్పడం పై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Telugu Ap, Ap Cm, Cbn Birthday, Chandrababu Naidu, Lokesh, Tdp, Vijay Sai Reddy, Ys Jagan-Telugu Political News

ఒక్కరోజు కి మామూలుగా చెబితే వచ్చిన నష్టం ఏంటట అనే  వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.రాజకీయంగా శత్రుత్వం ఉన్నా, దానికి సమయం సందర్భం అంటూ ఉంటుంది.కానీ ఎప్పుడూ ఒకే తరహా గా వ్యవహరిస్తే తమ పరువు తోపాటు, పార్టీ పరువు బజారున పడుతుందనే విషయాన్ని విజయసాయిరెడ్డి గ్రహించలేకపోతున్నారు.

వైసీపీపై ఎవరు ఏ విమర్శలు చేసినా,  ఎవరి పైన విమర్శలు చేయాల్సి వచ్చినా,  అందులో విజయసాయిరెడ్డి ముందుంటారు.సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ,  పంచ్ డైలాగులతో ప్రత్యర్థులను ఆట పట్టిస్తుంటారు.

ఈ విధంగా వైసీపీకి ఆయన అన్ని విషయాల్లోనూ మేలు చేస్తున్న , ఒక్కో సందర్భంలో మాత్రం తన వ్యవహార శైలితో వివాదాస్పదం అవుతూ,  పార్టీని,  అధినేత జగన్ ను సైతం ఇబ్బంది పెడుతూ ఉంటారు అనే విషయమూ ఇప్పుడు చర్చకు వస్తోంది.

#Lokesh #CBN Birthday #AP Cm #YS Jagan #Vijay Sai Reddy

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు