ప్రముఖ ఫుట్ బాల్ దిగ్గజం రోనాల్డో కు కూడా….  

Cristiano Ronaldo tested corona positive Cristiano Ronaldo, Test Positive, Portugal, Foot Ball Player, Swiden Foot Ball Match, Self Isolation - Telugu @cristiano, Cristiano Ronaldo, Foot Ball Player, Portugal, Self Isolation, Swiden Foot Ball Match, Test Positive

డ్రాగన్ దేశం చైనా లో మొదలైన ఈ కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అల్లాడిస్తుంది.ఈ మహమ్మారికి రాజు,పేద అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఈ మహమ్మారి బారిన పడుతున్నారు.

TeluguStop.com - Cristiano Ronaldo Tested Corona Positive

ఇప్పటికే పలువురు ఈ మహమ్మారి బారిన పడగా తాజాగా పోర్చుగల్ ఫుట్ బాల్ దిగ్గజం క్రిస్టియానో రోనాల్డో కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు తెలుస్తుంది.పోర్చుగల్ ఫుట్ బాల్ కెప్టెన్ మరియు జువెంటస్ స్టార్ రొనాల్డో కు కరోనా పాజిటివ్ రావడం తో ఈ సమాచారాన్ని పోర్చుగీస్ ఫుట్‌బాల్ ఫెడరేషన్ తెలిపింది.

అయితే ఫుట్ బాల్ ఫెడరేషన్ అందించిన సమాచారం ప్రకారం ఇప్పుడు రోనాల్డో పరిస్థితి బాగానే ఉందని, ప్రస్తుతం అతడు స్వీయ ఐసోలేషన్ లో ఉన్నట్లు వారు తెలిపారు. స్వీడన్ తో జరగబోయే పోరు కు సన్నద్దమౌతున్న నేపథ్యంలో ప్లేయర్స్ అందరికీ కూడా కరోనా పరీక్షలు నిర్వహించగా రోనాల్డో కు పాజిటివ్ నిర్ధారణ అయినట్లు తెలుస్తుంది.

TeluguStop.com - ప్రముఖ ఫుట్ బాల్ దిగ్గజం రోనాల్డో కు కూడా….-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

అయితే ప్రస్తుతం అతడిలో ఎలాంటి కరోనా లక్షణాలు లేకపోవడం తో సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉన్నట్లు తెలుస్తుంది.ప్రస్తుతం ఆయన పరిస్థితి బాగానే ఉన్నట్లు ఫెడరేషన్ తెలిపింది.

అయితే రొనాల్డో సానుకూల ఫలితం తర్వాత మిగిలిన పోర్చుగల్ జట్టు సభ్యులు అందరికి కూడా పరీక్షలు నిర్వహించామని, అయితే అందరికీ కూడా నెగిటివ్ వచ్చినట్లు యాజమాన్యం పేర్కొంది.దీనితో త్వరలో స్వీడన్‌తో జరిగే నేషన్స్ లీగ్ మ్యాచ్‌కు నెగిటివ్ వచ్చిన ఆటగాళ్లు అందరూ కూడా అందుబాటులోనే ఉంటారని ఫెడరేషన్ తెలిపింది.

రోనాల్డో ఫుట్ బాల్ ఆట తీరుకు ఒక్క పోర్చుగల్ మాత్రమే కాకుండా యావత్ ప్రపంచ వ్యాప్తంగా ఆయనకు అభిమానులు చాలా మంది ఉన్నారు.

అయితే అతడికి తాజాగా కరోనా పాజిటివ్ రావడం తో రెండు మ్యాచ్ లను కోల్పోయే అవకాశం కనిపిస్తుంది.

ఇక 5 సార్లు బాలన్ డి ఓర్ విజేత క్రిస్టియానో రొనాల్డో జువెంటస్ కోసం వచ్చే రెండు మ్యాచ్‌లను కోల్పోనున్నాడు.ప్రస్తుతం సీరీ ఎ ఛాంపియన్స్ వరుసగా సెరీ ఎ మరియు ఛాంపియన్స్ లీగ్ గ్రూప్ దశలో క్రోటోన్ మరియు డైనమో కీవ్లను ఎదుర్కోవలసి ఉంది.

#Self Isolation #@Cristiano #Portugal #Test Positive #SwidenFoot

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Cristiano Ronaldo Tested Corona Positive Related Telugu News,Photos/Pics,Images..