రోనాల్డో హ్యాండ్ బ్యాండ్ వేలంలో ఎంత ధర పలికిందంటే?

క్రిస్టియానో రొనాల్డో పేరు తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు.ఇక రొనాల్డొ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన అవసరం లేదు.

 Christiano Ronaldo Arm Band Auctioned To Help Suffering Child,christiano Ronaldo-TeluguStop.com

ఒక వ్యక్తిగా కడు పేదరికం నుండి గొప్ప ఫుట్ బాల్ ప్లేయర్ గా ఎదిగిన రొనాల్డొ జీవితం అందరికీ ఆదర్శం.ఫుట్ బాల్ ఆటకు ఓ ఐకాన్ గా రొనాల్డొ నిలిచాడు.

ఇక ప్రపంచ వ్యాప్తంగా రొనాల్డోకు కొన్ని కోట్ల మంది అభిమానులు ఉన్నారు.అయితే రోనాల్డో కు మార్కెట్లో ఉన్న డిమాండ్ ఎంతటిదో మనకు తెలిసిందే.

రొనాల్డో వాడిన ఏ ఆట వస్తువు కైనా మార్కెట్ లో ఎంతో డిమాండ్ ఉంటుంది.తాజాగా రొనాల్డో కు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.

ఓ మ్యాచ్ సందర్బంలో రోనాల్డో కోపంలో తన హ్యాండ్ బ్యాండ్ ను విసిరిపారేసాడట.అయితే ఆ గ్రౌండ్ సిబ్బంది వెంటనే దానిని సేకరించి వేలం వేయగా దిమ్మతిరిగే ధర పలికింది.

దాదాపు 55 లక్షలకు అంటే 64 వేల యూరోలకు ఒక వ్యక్తి దానిని సొంతం చేసుకున్నాడని తెలుస్తోంది.ఇక ఆ మొత్తాన్ని ఓ చారిటీ సంస్థకు అందజేశారు.

అయితే వెన్నెముక కండరాల వ్యాధితో బాధపడుతున్న చిన్నారి వైద్యానికి కొరకు ఈ నగదును కేటాయించునున్నట్టు తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube