హైదరాబాద్ లో భయపడుతున్నారు

హైదరాబాద్‌లో చ‌ట్ట వ్య‌తిరేక చ‌ర్య‌లకు పాల్ప‌డాలంటే నేరగాళ్లకు సీసీ కెమెరాల‌తో దొరికిపోతామనే భయం పట్టుకుంద‌ని పోలీస్‌ కమిషనర్ మహేందర్‌రెడ్డి అన్నారు.నిఘా నేత్రాలు విరివిగా ఉప‌యోగించ‌డంతో హైద‌రాబాద్‌ని నేరాలు లేని సిటీగా మార్చగలమని ధీమా వ్య‌క్తం చేశారు.

 Criminals Are Feared In Hyderbad-TeluguStop.com

పాతబస్తీ పరిధిలో సీసీ కెమెరాల ఏర్పాటుకు ఎన్టీపీసీ కోటి రూపాయల విరాళం ఇచ్చింది.ఈ సందర్భంగా మ‌హేంద‌ర్ రెడ్డి మాట్లాడారు.

సీసీ కెమెరాల‌తో పాతబ‌స్తీలో నేరాలు త‌గ్గుతాయ‌ని అన్నారు.హైద‌రాబాద్‌లో లక్ష సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలనే ల‌క్ష్యానికి ప‌లు సంస్థ‌లు భారీగా విరాళాలు అందించడాన్ని ఆయ‌న అభినందించారు.

గతంతో పోల్చితే హైద‌రాబాద్‌లో క్రైమ్‌ రేట్‌ 14 శాతం తగ్గినట్టు మహేందర్‌రెడ్డి చెప్పారు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube