విజయ్ సేతుపతిపై క్రిమినల్ కేసు.. ఎవరు పెట్టారో తెలుసా?

Criminal Case Registered Against Vijay Sethupathi

తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కరేదు.ఈయనకు తెలుగులో,తమిళం లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

 Criminal Case Registered Against Vijay Sethupathi-TeluguStop.com

విజయ్ సేతుపతికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఉప్పెన సినిమాలో విజయ్ పాత్రకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారని చెప్పవచ్చు.

తన నటనతో ఎంతో మంది ప్రేక్షకులను సంపాదించుకున్న విజయ్ తెలుగులో అతనంటే పడిచచ్చే అభిమానులు ఉన్నారు.తమిళ భాషలో కూడా ఎన్నో విభిన్నమైన పాత్రలు చేస్తూ విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్నారు విజయ్ సేతుపతి.

 Criminal Case Registered Against Vijay Sethupathi-విజయ్ సేతుపతిపై క్రిమినల్ కేసు.. ఎవరు పెట్టారో తెలుసా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

విజయ్ సేతుపతిని ఆయన అభిమానులు మక్కల్ సెల్వన్ అని ముద్దుగా పిలుచుకుంటారు.ఇదిలా ఉంటే తాజాగా విజయ్ సేతుపతి పై క్రిమినల్ కేసు నమోదు అయ్యింది.

విజయ్ సేతుపతితో పాటుగా అతని మేనేజర్ జాన్సన్ పై కూడా చర్యలు తీసుకోవాలి అని సైదాపేట కోర్టులో కేసు వేశారు.ఇక ఇటీవలే బెంగుళూరు విమానాశ్రయంలో విజయ్ సేతుపతి పై దాడి జరిగిన సంగతి మనందరికీ తెలిసిందే.

ఈ ఘటనలో గాంధీ అనే ఒక వ్యక్తి విజయ్ సేతుపతి పై దాడి చేయగా.అప్రమత్తమైన విజయ్ మేనేజర్ భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు.

ఈ విషయం పై పరువు నష్టం దావా వేసిన గాంధీ విజయ్ తాజాగా క్రిమినల్ కేసు పెట్టాడు.నవంబర్ 2 న మెడికల్ చెకప్ కోసం మైసూర్ వెళ్తున్నానని, బెంగళూరు ఎయిర్ పోర్టులో విజయ్ ని కలిశానని తెలిపాడు.అప్పుడు వారి మధ్య అపార్ధాలు రావడంతో విజయ్ సేతుపతి అతని మేనేజర్ జాన్సన్ తనను కొట్టారని ఫిర్యాదులో పేర్కొన్నాడు.తాను కూడా నటుడిగా అని కాబట్టి విజయ్ ని పలకరించానని చెప్పుకొచ్చాడు.

అలాగే అతనితో అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు తన కులాన్ని కించపరచారు తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.తనపై జరిగిన దాడులు చెవికి దెబ్బ తగిలింది అని, దీనితో చెవి పూర్తిగా వినిపించడం లేదని తెలిపాడు.

అలాగే ఆ సంఘటన జరిగిన సమయంలో తాను మద్యం సేవించలేదని తనపై తప్పుడు ప్రచారం చేయడంతో తన పరువు ప్రతిష్టలకు భంగం వాటిల్లిందని, మూడు కోట్ల పరువు నష్టం దావా వేశాడు గాంధీ.

#Criminal #Gandhi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube