కరోనా ఆసుపత్రిలో నైట్ డ్యూటీ చేస్తున్న వైద్యురాలిపై చెయ్యేసిన సీనియర్ డాక్టర్…  

Crime News Jharkhand Ranchi - Telugu Corona Virus Hospital, Crime News, Jharkhand, Ranchi

ప్రస్తుత కాలంలో కొందరు కామాంధులు వయసుతో సంబంధం లేకుండా ప్రవర్తిసస్తూ గౌరవ ప్రదమైనటువంటి వృత్తులను చేపట్టి  సేవలందిస్తున్న మహిళలపై అత్యాచారాలకు పాల్పడి వారు చేపట్టినటువంటి వృత్తికే కళంకం తెస్తున్నారు.తాజాగా ఓ సీనియర్ వైద్యుడు తన క్రింద పని చేస్తున్నటువంటి జూనియర్ మహిళా వైద్యురాలిపై అత్యాచారయత్నానికి పాల్పడిన వైద్యుడనే మాటకే మచ్చ తెచ్చాడు.

 Crime News Jharkhand Ranchi

ఈ ఘటన జార్ఖండ్ రాష్ట్రం రాజధాని అయినటువంటి రాంచీ పట్టణ పరిసర ప్రాంతంలో కలకలం రేపింది.

వివరాల్లోకి వెళితే స్థానిక పట్టణంలో ఓ మహిళ తన కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉండేది.

కరోనా ఆసుపత్రిలో నైట్ డ్యూటీ చేస్తున్న వైద్యురాలిపై చెయ్యేసిన సీనియర్ డాక్టర్…-Latest News-Telugu Tollywood Photo Image

అయితే ఈమె వృత్తి రీత్యా వైద్యురాలు కావడంతో స్థానిక పట్టణంలో ఉన్నటువంటి రిమ్స్ ఆసుపత్రిలో తన వైద్య సేవలను అందిస్తుంది.అయితే ఇంతటి విపత్కర సమయంలో కూడా వైద్య సేవలు అందిస్తున్నటువంటి  వైద్యురాలికి అండదండలు అందించాల్సింది పోయి ఓ సీనియర్ వైద్యుడు ఆమెపై కన్నేసి దారుణంగా అత్యాచారానికి యత్నించాడు.

అయితే మహిళ ఎలాగోలా అతడి నుంచి తప్పించుకుని దగ్గరలో ఉన్నటువంటి పోలీసులను సంప్రదించింది.

ఇందులో భాగంగా తన పై జరిగినటువంటి అఘాయిత్యం గురించి మహిళా వైద్యురాలు ఫిర్యాదు చేస్తూ సీనియర్ వైద్యుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది.

 దీంతో రంగంలోకి దిగిన టువంటి పోలీసులు కీచక వైద్యుడిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు.ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది.

అంతేకాక కొందరు నెటిజన్లు దేశంలో ప్రస్తుతం ఇంతటి ప్రమాదకర పరిస్థితులలోకూడా వైద్యులు ఏ మాత్రం భయపడకుండా తమసేవలను అందిస్తున్నారని అలాంటి వారికి మేలు చేయకపోయినా పర్లేదు కానీ కీడు మాత్రం తలపెట్టొద్దని అంటూ కామెంట్లు చేస్తున్నారు.మరి కొంత మంది మాత్రం ఇలా పవిత్రమైనటువంటి వైద్య వృత్తిని చేపట్టి మహిళా వైద్యురాలిపై అత్యాచారానికి ఒడిగట్టినటువంటి వైద్యుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Crime News Jharkhand Ranchi Related Telugu News,Photos/Pics,Images..

footer-test