ఆరెంజ్ క్యాప్ దక్కినా.. అరుదైన రికార్డ్ చేజారింది.! అదేంటో తెలుసా.?     2018-05-28   23:16:10  IST  Raghu V

డేవిడ్ వార్నర్ స్థానంలో అనూహ్యంగా సన్‌రైజర్స్ కెప్టెన్సీ పగ్గాలు చేపట్టిన విలియమ్సన్ జట్టును అద్భుతంగా ముందుకు నడిపించాడు. వార్నర్ లేని లోటును పూడ్చుతూ.. బ్యాటింగ్‌లోనూ అదరగొట్టాడు. 2017 వరకూ మూడు సీజన్లలో కలిపి ఐపీఎల్‌లో 411 పరుగులే చేసిన ఈ కివీస్ ఆటగాడు.. ఈ సీజన్లో మాత్రం సత్తా చాటాడు. వార్నర్ స్థానాన్ని భర్తీ చేస్తూ.. 735 పరుగులు సాధించాడు.

జట్టును ఫైనల్ చేర్చిన విలియమ్సన్.. ఆరెంజ్ క్యాప్‌ను దక్కించుకోవడంతోపాటు ఐపీఎల్ చరిత్రలోనే ఒక సీజన్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో కోహ్లి, వార్నర్ మాత్రమే కేన్ కంటే ముందున్నారు.

-

చెన్నైతో జరిగిన ఫైనల్లో వాట్సన్ విధ్వంసంతో ఐపీఎల్ ట్రోఫీ సన్‌రైజర్స్ చేజారింది. దీంతో అరుదైన రికార్డ్ విలియమ్సన్ చేజారింది. ఆరెంజ్ క్యాప్‌తోపాటు ఐపీఎల్ కప్ గెలిచిన తొలి కెప్టెన్‌గా రికార్డ్ నెలకొల్పే ఛాన్స్‌ను కేన్ మిస్సయ్యాడు. 2016లోనూ విరాట్ కోహ్లి విషయంలో ఇలాగే జరిగింది. ఆ ఏడాది వార్నర్ 848 రన్స్ చేయగా.. సన్‌రైజర్స్ ట్రోఫీ సొంతం చేసుకుంది.

-

గత 11 ఏళ్లలో ఆరెంజ్ క్యాప్‌తోపాటు ఐపీఎల్ ట్రోఫీ నెగ్గిన ఏకైక ఆటగాడు (జట్టు సభ్యుడిగా) రాబిన్ ఉతప్ప మాత్రమే. 2014లో గంభీర్ నాయకత్వంలో కోల్‌కతా కప్ నెగ్గగా, ఆ జట్టులో సభ్యుడైన ఉతప్ప ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్నాడు.