ఈ రాహుల్‌ సెంచరీ కొడితే ఈ రాహుల్‌ డకౌట్‌

నేడు న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీం ఇండియా ఓడిపోయినా కూడా కేఎల్‌ రాహుల్‌ అద్బుతమైన సెంచరీ సాధించి జట్టు పరువు నిలిపాడు.దారుణమైన పరాభవం నుండి తప్పించాడు.

 Cricketr Rahul And Rahul Gandhi Latest Update-TeluguStop.com

జట్టు స్కోర్‌ను 300 లకు చేరువ అయ్యేలా చేయడంలో రాహుల్‌ చాలా కష్టపడ్డాడు.టీం ఇండియా కోసం రాహుల్‌ ఎప్పటికప్పుడు చాలా కష్టపడుతూనే ఉన్నాడు.

గత కొంత కాలంగా ఆయన ఆట తీరు అద్బుతంగా ఉంది అంటూ అంతా అభినందనలు వ్యక్తం చేస్తున్నారు.

నేడు రాహుల్‌ సెంచరీ కొట్టగా మరో రాహుల్‌ అయిన కాంగ్రెస్‌ నేత డకౌట్‌ అయ్యాడు.

హస్తిన అసెంబ్లీ ఎన్నికల్లో దారుణమైన ఫలితాన్ని కాంగ్రెస్‌ చవి చూసింది.గతంలో వరుసగా నాలుగు సార్లు ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్‌ గత రెండు సార్లుగా కనీసం ఒక్క సీటు కూడా రాలేదు.

మొత్తం డెబ్బై సీట్లలో కనీసం ఒక్క స్థానంను దక్కించుకోక పోవడంతో కాంగ్రెస్‌ వర్గాల వారు తల దించుకునే పరిస్థితి.రాహుల్‌ గాంధీ ఎంతగా ప్రయత్నించినా కూడా ఓట్లు రాబట్టడంలో మాత్రం విఫలం అవుతున్నాడు.

కేఎల్‌ రాహుల్‌ సెంచరీ చేస్తే, రాహుల్‌ గాంధీ మాత్రం డకౌట్‌ అయ్యాడంటూ నెటిజన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube