క్రికెట్ ఆడుతూ నేలకొరిగిన క్రికెటర్స్ వీరే..!

చాలామంది నాని హీరోగా చేసిన జెర్సీ సినిమా చూసే ఉంటారు.అందులో హీరో నాని క్రికెట్ ఆడుతూనే ప్రాణాలు కోల్పోతాడు.

 Cricketers Who Died While Playing Cricket , Cricketers, Stadium, Died Cricketers-TeluguStop.com

అలాగే భీమిలీ కబడ్డీ జట్టు సినిమాలో కూడా కబడ్డీ ఆడుతూ చనిపోతాడు.అయితే అది సినిమా.

కానీ నిజజీవితంలో కూడా అలా కొంతమంది క్రీడాకారులు ప్రాణాలు కోల్పోయారని మీకు తెలుసా.? మిగతా క్రీడల విషయం అటుంచితే క్రికెట్లో కూడా ఇలాంటి మరణాలు సంభవించాయి.క్రికెట్ మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు 12 మంది క్రికెటర్లు మైదానంలోనే చనిపోయారు.గాయాల వల్ల కానీ, ఇతర కారణాల వల్ల కానీ మైదానంలోనే కుప్పకూలిపోయి వారంతా ప్రాణాలొదిలారు.

అలాంటి వారి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఇంగ్లాండ్ క్రికెటర్ అయిన విల్ స్లాక్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో అకస్మాత్తుగా కుప్పకూలిపోయి చనిపోయాడు.

ఇంగ్లాండ్‌కు చెందిన ఇయాన్ ఫోలే ఒక మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తుండగా కంటికి బంతి బలంగా తాకి గాయాలపాలయ్యాడు.అయితే అతడిని ఆసుపత్రికి తరలించి శస్త్ర చికిత్స చేస్తుండగా గుండెపోటు వచ్చి చనిపోయాడు.

ఇండియాకు చెందిన రమన్ లాంబా ఫీల్డింగ్ చేస్తుండగా బంతి బలంగా తాకి అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.పాకిస్తాన్‌కు చెందిన వసీమ్ రాజా అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ఇంగ్లాండ్‌లో కౌంటీ క్రికెట్ ఆడేవాడు.

ఆ సమయంలో ఒక మ్యాచ్ జరుగుతుండగా పిచ్ మధ్యలోనే హార్ట్ ఎటాక్ వచ్చి చనిపోయాడు.సౌత్ఆఫ్రికాకు చెందిన డారెన్ రాండల్ ఫీల్డ్‌లో బంతి తలకు తగలడంతో చనిపోయాడు.

ఆస్ట్రేలియా జట్టు లో సభ్యుడైన ఫిలిప్ హ్యూస్ మరణం ఇటీవల కాలంలో అందరినీ కంటతడి పెట్టించింది.మైదానంలో బంతి తగలడంతో తీవ్ర గాయాలపాలై ఆసుపత్రిలో చేరాడు.

అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు.ఇలా క్రికెట్ ఆడుతూ బంతి తగిలి మైదానంలో మృతి చెందిన క్రికెటర్లు చాలా మంది ఉన్నారు.

ఆటే ప్రాణంగా బతికి చివరికి ఆట ఆడుతూ చనిపోవడం వల్ల వీరు క్రికెట్ చరిత్రలో ముఖ్యులుగా లిఖించబడ్డారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube