టీం ఇండియా ఆటగాడు దినేష్‌ కార్తీక్‌ బేషరతు క్షమాపణ

వెస్టిండీస్‌లో జరిగిన కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో షారుఖ్‌ ఖాన్‌కు చెందిన జట్టు ట్రిన్‌బాగో నైట్‌ రైడర్స్‌ జట్టుకు మద్దతు తెలిపేందుకు టీం ఇండియా ఆటగాడు దినేష్‌ కార్తీక్‌ అక్కడకు వెళ్లిన విషయం తెల్సిందే.అక్కడ దినేష్‌ కార్తీక్‌ ట్రిన్‌బాగో జెర్సీ వేసుకుని డ్రస్సింగ్‌ రూంలో కనిపించారు.

 Cricketerdinesh Karthik Apologiesto Bcci Ipl-TeluguStop.com

బీసీసీఐతో ఒప్పందంలో ఉన్న ఏ ఆటగాడు కూడా ఇండియన్‌ జెర్సీ లేదంటే ఐపీఎల్‌ జెర్సీ తప్ప మరేదాన్ని ధరించకూడదు.కార్తీక్‌ నిబంధన ఉల్లంగించిన కారణంగా షోకాజు నోటీసులను అందుకోవడం జరిగింది.

తాజాగా షో కాజు నోటీసులకు దినేష్‌ కార్తీక్‌ స్పందించాడు.</br>

తాను చేసిన తప్పుకు బేషరతుగా క్షమాపణలు చెబుతున్నట్లుగా పేర్కొన్నాడు.

బీసీసీ అనుమతి లేకుండా అక్కడకు వెళ్లడం కూడా తనది తప్పే అంటూ దినేష్‌ ఒప్పుకున్నాడు.ఇకపై తన నుండి ఇలాంటి తప్పులు జరుగకుండా చూసుకుంటాను అంటూ ప్రకటించాడు.

దీనేష్‌ కార్తీక్‌ క్షమాపణలు చెప్పడంతో ఈ వివాదం ఇక్కడితో ముగిసే అవకాశం ఉందని క్రీడావర్గాల వారు అంటున్నారు.షోకాజు నోటీసుకు వెంటనే స్పందించి తన తప్పును ఒప్పుకుని క్షమాపణలు చెప్పిన కారణంగా బీసీసీఐ పెద్దలు క్షమించే అవకాశం ఉంది.

లేదంటే ఆయనకు కఠిన శిక్షలు పడే అవకాశం ఉందని అంటున్నారు.మరో రెండు మూడు రోజుల్లో కార్తీక్‌ క్షమాపణలపై చర్చించి తుది తీర్పును బీసీసీఐ పెద్దలు వెళ్లడించనున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube