కోహ్లీ, అనుష్కల ముద్దుల కూతురి పేరు ఏంటో తెలుసా.. ?

ఎంతటి సెలబ్రేటీలు అయినా వారికి భావోద్వేగాలు ఉంటాయన్న విషయం తెలిసిందే.కానీ అవి సందర్భాన్ని బట్టి బయటకు వస్తాయి.

 Virat Kohli And Anushka Sharma Named Their Daughter Vamika, Virat Kohli , Anushk-TeluguStop.com

ఇక ఆడవారికి మాతృత్వం అనేది ఒక వరం.అదే సమయంలో భర్త పోస్ట్ నుండి తండ్రి స్దానంలోకి వెళ్లే మగవారిలో కూడా మార్పు వస్తుంది.అప్పటి వరకు ఒక లోకంలో ఉంటే తల్లిదండ్రులు అయిన తర్వాత వారి ప్రపంచం పిల్లలతోనే.

ఇకపోతే మైదానంలో మెరుపులు మెరిపించే విరాట్ కోహ్లీ తన ఇంటిలో సరికొత్త ఉద్యోగాన్ని పొందారు.

అదేనండి తండ్రి అనే స్దానంలోకి మారాడన్న మాట.ఇక కామన్‌గా సెలబ్రేటీలకు పిల్లలు పుడితే వారికి ఏ పేరు పెట్టారో తెలుసుకోవాలని అభిమానులకు ఆశగా ఉంటుంది.

Telugu Anushka Sharma, Anushkasharma, Baby Vamika, Baby, Vamika, Virat Kohli, Vi

ఆ ఆశను నెరవేరుస్తూ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ తమ కుమార్తె పేరును ప్రకటించారు.ఈ విషయాన్ని అనుష్క శర్మ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ ద్వారా వెల్లడించారు.కాగా అనుష్క జనవరిలో పండంటి బిడ్దకు జన్మను ఇవ్వగా, తాజాగా ఆ బిడ్దకు ‘వామికా’ అని పేరు పెట్టినట్లు తెలియచేశారు.

అంతే కాకుండా ‘వామికా’ రాకతో మా జీవితం సరికొత్త స్థాయికి వెళ్ళింది.

కన్నీళ్లు, నవ్వు, ఆందోళన, ఆనందం కొన్ని నిమిషాల వ్యవధిలో అనుభవించిన భావోద్వేగాలు అని వారు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube