రోహిత్‌శర్మ చేసిన ప్రాంక్‌కి హడలిపోయిన రితికా.. నెట్టింట నవ్వులు పూయిస్తున్న వీడియో..!

టీమిండియా క్రికెటర్ ‘హిట్​మ్యాన్​’ రోహిత్ శర్మ గురించి పరిచయాలు అవసరం లేదు.తనదైన బ్యాటింగ్ స్టైల్‌తో తనకంటూ ప్రత్యేకంగా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న క్రికెటర్లలో రోహిత్ శర్మ కూడా ఒకరు.

 Cricketer Rohith Sharma Prank On Wife Rithika Going Viral In Soical Media, Rohit-TeluguStop.com

చాలా కామ్‌గా కనిపించే రోహిత్ బ్యాట్ పడితే మాత్రం రికార్డుల మోత మొగాల్సిందే.ఇప్పటికే టీ20 మ్యాచులలో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాట్స్‌మన్‌గా రికార్డు సృష్టించారు.

వన్డేల్లో డబుల్ సెంచరీలు, వరల్డ్‌కప్‌ టోర్నీలో వరుస సెంచరీలు… ఇలా ఎవరికీ సాధ్యంకాని అసాధారణమైన రికార్డులు నెలకొల్పి వావ్ అనిపించారు.ఈ ప్రతిభా, కృషితోనే అతను ఇప్పుడు టీ20 కెప్టెన్సీ పగ్గాలు తీసుకోవడానికి కూడా రెడీ అయిపోయారు.

అయితే రోహిత్ క్రికెట్​కు ఎంత ప్రాముఖ్యత ఇస్తారో.తన కుటుంబానికి కూడా అంతే ప్రాముఖ్యత ఇస్తారు.ముఖ్యంగా తన సతీమణి రితికాతో సమయం గడిపేందుకు రోహిత్ బాగా ఇష్టపడుతుంటారు.అంతేకాదు ఆమెను తెగ ఆట పట్టిస్తారు.

ప్రాంక్‌లు చేస్తూ రితికాని సరదాగా భయపెట్టిస్తుంటారు.తాజాగా కూడా రోహిత్ శర్మ ఒక ప్రాంక్‌ చేశారు.

అయితే.ఇప్పుడు ఏం చేసి తనని భయపెడతాడేమోనని రితికా బాగా భయపడిపోయింది.

చిన్నపిల్లలా భయపడుతూ ఆమె నో నో అంటూ పరిగెత్తింది.

ఇంతకీ రోహిత్ ఏం చేశారంటే.

అతను తన చేతిలో ఒక క్యాండీ చాక్లెట్ దాచిపెట్టి అదేంటో తెలుసుకోవాల్సిందిగా భార్య దగ్గరికి వెళ్లారు.

అతని చేతిలో ఏముందోనని ఆమె హడలిపోయింది.అది తీసుకోవడానికి నిరాకరించింది.కానీ తన చేతిలో భయపెట్టే వస్తువు ఏదీ లేదు అంటూ రోహిత్ శర్మ ప్రామిస్ చేశారు.

అప్పుడు ఆమె కొంచెం ధైర్యం చేసి చేతిలో ఉన్నది ఏంటో చూపించాలని అడిగింది.అప్పుడు రోహిత్ తన చేతిలో ఉన్న ఓ క్యాండీ చూపించడంతో ఆమె గట్టిగా ఊపిరి పీల్చుకుంది.

హమ్మయ్య ఈ సారి బతికిపోయానన్నట్లు ఆమె పెట్టిన ఎక్స్‌ప్రెషన్‌ భలే క్యూట్ గా అనిపించింది.ఈ ప్రాంక్‌కి సంబంధించిన వీడియోని రోహిత్ శర్మ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.

ఈ వీడియో చూసి నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు.పాపం ఎందుకలా భయపడతారు అంటూ మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.

స్పోర్ట్స్ మేనేజర్ రితికాను 2015లో రోహిత్ శర్మ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.వీరికి సమైరా అనే మూడేళ్ల కూతురు ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube