కెప్టెన్ గా మారిన రిషబ్ పంత్..!

ఏప్రిల్ 9వ తేదీన చెన్నై నగరం వేదికగా ఐపీఎల్ 14వ సీజన్ ప్రారంభం కానుంది.ఈ టీ20 మ్యాచ్ లను చూసేందుకు అభిమానులు ఎంతో ఆసక్తికరంగా వేచి చూస్తున్నారు.

 Indian Cricketer Rishabh Pant Appointed As Delhi Capitals Captain, Delhi Capital-TeluguStop.com

అయితే ఈసారి ఐపీఎల్ బరిలోకి దిగనున్న 8 టీమ్ లు కీలకమైన మార్పులు చేర్పులతో టైటిల్ దక్కించుకునే దిశగా ముందడుగు వేస్తున్నాయి.ఇందులో భాగంగానే ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం టీమిండియా డైనమెట్ ఆటగాడైన రిషబ్ పంత్ ని తమ టీమ్ కి కొత్త క్యాప్టెన్ గా నియమించింది.

ఇదే విషయాన్ని మంగళవారం రోజు ఢిల్లీ క్యాపిటల్స్ సహా – యజమాని పార్థ జిందాల్ అధికారికంగా వెల్లడించారు.


ఢిల్లీ క్యాపిటల్స్ టీం కి శ్రేయస్ అయ్యర్ రెగ్యులర్ కెప్టెన్ గా ఉండేవారు కానీ అతని భుజానికి గాయం కావడంతో ఐపీఎల్ 14 సీజన్ నుంచి తప్పుకున్నారు.

దీంతో ఆయన ప్లేస్ ని భర్తీ చేసేందుకు రిషబ్ పంత్ ని కెప్టెన్ గా నియమించారు.అయితే రిషబ్ పంత్ క్యాప్టెన్ గా నియమించడం పట్ల శ్రేయస్ అయ్యర్ హర్షం వ్యక్తం చేశారు.

కెప్టెన్ గా రిషబ్ పంత్ సరైన ఛాయిస్ అని ఆయన అన్నారు.నిజానికి రహానే, శిఖర్ ధావన్, రవిచంద్రన్ అశ్విన్ వంటి సీనియర్ ఆటగాళ్లు ఉన్నప్పటికీ వారందరినీ పక్కన పెట్టేసి.

రిషబ్ పంత్ కి కెప్టెన్ బాధ్యతలు అప్పజెప్పారు.జట్టులోకి కొత్తగా వచ్చిన ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాట్స్‌మ్యాన్‌ స్టీవ్ స్మిత్ ని సైతం కాదని రిషబ్ పంత్ వైపే మొగ్గు చూపారు.


ఇకపోతే ఏప్రిల్ 9వ తేదీన చెన్నై వేదికగా ముంబై ఇండియన్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్లు తలపడనున్నాయి.ఏప్రిల్ 10వ తేదీన ఢిల్లీ క్యాపిటల్స్ ఐపీఎల్ 14 సీజన్ లో తొలి మ్యాచ్ ఆడనుంది.

అయితే ఈ జట్టు తొలి మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ తో తలపడనున్నది.ఈ మ్యాచ్ ముంబై వేదికగా జరగనున్నది.గత సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ రన్నరప్ గా నిలిచింది.ఈసారైనా ఫైనల్ మ్యాచ్ లో గెలిచి కప్ సొంతం చేసుకుంటుందో లేదో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube