వైరల్: టీచర్ గా మారిన ' ది వాల్ '..!

రాహుల్ ద్రవిడ్ ఈ పేరుకి పెద్దగా పరిచయం అక్కర్లేదని చెప్పాలి.క్రికెట్ ఆటలో తనదైన శైలిలో ఆటను ఆడి ఎంతో మంది హృదయాల్లో పదిలమైన ముద్ర వేసుకున్న గొప్ప ఆటగాడు రాహుల్ ద్రవిడ్.

 Cricketer Rahul Dravid Teaches Kannada Lessons To British High Commissioner, Rah-TeluguStop.com

ఇప్పుడు మన మాజీ క్రికెటర్ అయిన రాహుల్ ద్రవిడ్ కోచ్ గా ఉంటున్న విషయం మన అందరికి తెలిసిందే.అయితే రాహుల్ ఒక పక్క కోచ్ గా వ్యవహరిస్తూనే మరో పక్క కన్నడ టీచర్ గా కూడా పాటాలు చెప్పడం విశేషం అనే చెప్పాలి.

మాజీ క్రికెటర్ రాహుల్ ఏంటి.? కన్నడ పాఠాలు చెప్పడం ఏంటి అనుకుంటున్నారా.?! అవునండి నిజంగానే.మన రాహుల్ ద్రవిడ్ బ్రిటిష్ హై కమిషనర్ అలెక్స్ ఎల్లీస్ కు కన్నడ భాషలో పాఠాలు నేర్పించారు.

వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణకు సబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది.నెటిజన్లు సైతం ఈ వీడియోను బాగా ఇష్టపడుతున్నారు.

అసలు వివరాల్లోకి వెళితే.ఇటీవల శ్రీలంకతో మన టీమిండియా క్రికెట్ యువ జట్టు టీ20 సిరీస్ కోసం తలపడి విజయం సాధించిన విషయం అందరికి తెలిసిందే.

అయితే ఆ యువ క్రికెటర్ జట్టు విజయం సాధించడంలో కోచ్ గా వ్యవహరిస్తున్న రాహుల్ ద్రవిడ్ పాత్ర అధికంగానే ఉందని చెప్పాలి.టీమ్ కు కోచ్ గా రాహుల్ ద్రవిడ్ తన వంతు బాధ్యతను సక్రమంగా నిర్వర్తించారు.

ఇప్పుడు ప్రస్తుతం మళ్ళీ ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ కోసం ఇండియా పోటీ పడుతున్న సమయంలో కోచ్ గా మాత్రమే కాకుండా రాహుల్ ద్రవిడ్ కన్నడ టీచర్ గా కుడా మారారు.

ఈ టెస్ట్ సిరీస్ లో భాగంగా ద్రవిడ్ బ్రిటిష్ హై కమిషనర్ అలెక్స్ ఎల్లీస్ కు కన్నడ బాష నేర్పించే పనిలో పడ్డాడు.వీరివురి మధ్య జరిగిన సంభాషణకు సంబందించిన వీడియో నెట్టింట్లో వైరల్ అయింది.ఈ వీడియోలో రాహుల్ కన్నడ నేర్పించే క్రమంలో ఆయన ఫేస్ లో వివిధ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం గమనార్హం అనే చెప్పాలి.

అయితే క్రికెట్ ని కన్నడ భాషలో వేరొకరోతో చెప్పడం అంటే మాములు విషయం కాదు.క్రికెట్ ఆడేటప్పుడు క్రికెటర్ పెట్టే పరుగును కన్నడలో ” బేగా ఓడి” అని అంటారు.

అదే పదాన్ని రాహుల్ అక్కడ ఉన్న బ్రిటిష్ హై కమిషనర్ అలెక్స్ ఎల్లీస్ కు చెప్పాలని ప్రయత్నం చేసి పరుగును కన్నడలో “బేగా ఓడి” అంటరాని నేర్పించాడు.అలా మన మాజీ క్రికెటర్ ఒక కన్నడ టీచర్ గా మారి పాఠాలు చెప్పడం నెటిజన్లను బాగా ఆకర్షిస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube