భారత క్రికెట్ జట్టుకు హెడ్‌కోచ్‌గా రాహుల్ ద్రవిడ్‌..?

ప్రస్తుతం టీమిండియాకు హెడ్‌కోచ్‌గా వ్యవహరిస్తున్న రవిశాస్త్రి పదవీకాలం టీ20 వరల్డ్ కప్ తర్వాత ముగియనుంది.దీంతో బీసీసీఐ అతని స్థానంలో ఎవరిని నియమించాలనే అంశంపై సమాలోచనలు చేస్తోంది.

 Cricketer Rahul Dravid Going To Be India Cricket Team Head Coach Details, Team I-TeluguStop.com

ఈ క్రమంలో అనిల్ కుంబ్లే, జయవర్ధనే వంటి సీనియర్ ఆటగాళ్ల పేర్లు వినిపించాయి.కానీ చివరికి ఆ పదవి ప్రస్తుత ఎన్‌సీఏ హెడ్‌ రాహుల్ ద్రవిడ్‌నే వరించినట్లు తెలుస్తోంది.

ఐపీఎల్ 14వ సీజన్ ముగిసిన తర్వాత బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ, సెక్రటరీ జైషా. ద్రవిడ్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యారని ఓ జాతీయ మీడియా పత్రిక వెల్లడించింది.

ఈ సమావేశంలో గంగూలీ, జైషా కలసి ద్రవిడ్‌ని హెడ్‌కోచ్‌గా బాధ్యతలు స్వీకరించాలని విజ్ఞప్తి చేశారట.దాంతో ద్రవిడ్ భారత జట్టుకు హెడ్‌కోచ్‌గా ఉండేందుకు అంగీకరించారని ఓ బీసీసీఐ అధికారి వెల్లడించారు.

ద్రవిడ్‌ 2023 వరకు.అనగా ఇప్పటినుంచి రెండేళ్ల పాటు కోచ్‌గా విధులు నిర్వర్తించేందుకు ఒప్పుకున్నారని బీసీసీఐ అధికారి పేర్కొన్నారు.

ప్రస్తుతం ఎన్‌సీఏ హెడ్‌గా ఉన్న ద్రవిడ్‌ టీ20 వరల్డ్ కప్ తర్వాత ఆ బాధ్యతల నుంచి వైదొలుగుతారని.అనంతరం భారత జట్టు హెడ్‌కోచ్‌ పదవిని చేపడతారని తెలుస్తోంది.

ఇక బౌలింగ్‌ కోచ్‌గా పరాస్‌ మామ్‌బ్రేను నియమించుకోవడానికి సిద్ధమైనట్లు సమాచారం.ప్రస్తుతం బ్యాటింగ్‌ కోచ్‌గా కొనసాగుతున్న విక్రమ్‌ రాఠోడ్‌.

అలాగే ఫీల్డింగ్ కోచ్‌గా కొనసాగుతున్న ఆర్‌.శ్రీధర్‌ విషయంలో ఇప్పటివరకైతే ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వార్తలు వస్తున్నాయి.

Telugu Bcci, Coach, Jay Shah, Latest, Rahul Dravid, Ravi Shastri, Saurav Ganguly

రాహుల్ ద్రవిడ్‌ ఎంతో మంది యువ క్రికెటర్లకు అండర్‌-19 స్థాయిలో శిక్షణ అందించి వారిని అద్భుతమైన ఆటగాళ్లుగా తీర్చిదిద్దారు.అతని పర్యవేక్షణలో మేటి ఆటగాళ్లుగా తయారైన చాలా మంది ప్లేయర్స్ ఇప్పుడు టీమిండియాలోనూ రాణిస్తున్నారు.దీనితో అతన్ని ఇండియన్ జట్టుకు హెడ్‌కోచ్‌గా నియమిస్తే యువ రక్తం మరింత ఉరకలేస్తుందని.మరిన్ని ఫలితాలు అందుకోవచ్చునని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.ఈ నేపథ్యంలో సౌరవ్ గంగూలీ ద్రవిడ్‌ని కలిసి హెడ్‌కోచ్‌గా ఉండడానికి ఒప్పించినట్లు సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube